Wednesday, May 1, 2024

రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవు: ఈటెల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న 68 మందిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. కరోనాతో ఈ రోజు ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో కరోనా పేషెంట్ ఎవరూ సీరియస్ గా లేరు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 10 వేల మంది శాంపిల్స్ ను పరీక్షించాం. గాంధీలో ఉన్న కరోనా బాధితులకు మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. గాంధీ ఆస్పత్రిలో 24 గంటలు నీటీ సరఫరా, ఇతర సదుపాయాలు అందిస్తున్నాం. గాంధీలో పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. గచ్చిబౌలిలో 1500 పడకలతో ఆస్పత్రిని సిద్ధం చేశాం. ఈనెల 20న గచ్చిబౌలి ఆస్పత్రిని ప్రారంభిస్తాం.10 లక్షల పిిపిఈ కిట్లు అందుబాటులోకి ఉంచుకుంటున్నాం. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు సామాజిక దూరం పాటించాలి.  మర్కజ్ కు వెళ్ళొచ్చిన వాళ్లను కలిసిన కొందరు ఇంకా టెస్టులు చేయించుకోవటానికి రాలేదు. వాళ్లు భాద్యతాయుతంగా పరీక్షలు చేయించుకుంటే అందరికి మంచింది. మర్కజ్ నుంచి వచ్చిన ఆరుగురి ద్వారా 81 మందికి కరోనా సోకింది. కొందరు బాధ్యత లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నీ కరోనా ల్యాబ్స్ పూర్తిస్తాయిలో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకు 5 వేల కరోనా టెస్టులు చేసేలా సిద్ధం చేస్తున్నాం. రోజుకు 3.25 లక్షల ఎన్95 మాస్కులు, 2.45 లక్షల పిపిఈ కిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. హైదరాబాద్ లోనే ఎక్కువ కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయని అని మంత్రి ఈటెల వివరించారు.

Minister Etela Rajender Speaks to Media over Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News