Friday, May 3, 2024

రాష్ట్రంలో హ్యాట్రిక్ దిశగా గులాబీ: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 90 సీట్లను గెలుచుకుని హ్యాట్రిక్ సాధించి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 సీట్లకు 13 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతారని అన్నారు. సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది విమర్శలు చేస్తున్నారని వారికి రాష్ట్ర ప్రజలే రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రతిపక్షాలకు ఏ సబ్జెక్టు లేక గృహలక్ష్మి, బీసీ బంధుపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

గృహలక్ష్మి, బిసి బంధు స్కీంలు నిరంతర ప్రక్రియ అని పునరుద్ఘాటించారు. రాజకీయ అనుభవం లేని కొంతమంది అజ్ఞానులు చేసే విమర్శలకు తాను స్పందించనని మంత్రి అన్నారు. ఎన్నికల ముందు వచ్చి పిచ్చిమాటలు మాట్లాడేవాళ్లంతా ఎన్నికలయ్యాక మళ్లీ కనుమరుగవుతారని జోష్యం చెప్పారు. విమర్శలు చేసేవారిపట్ల కరీంనగర్ ప్రజలు తస్మాత్ జాగ్రత్త ఉండాలని కోరారు. నమ్మి అధికారమిస్తే దోచుకునేందుకు కొందరు కాచుకుకుర్చు న్నారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి గంగుల వెల్లడించారు. సురక్షితంగా ఉన్న కరీంనగర్‌ను అశాంతి కోసం ప్రయత్నిస్తోన్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొందరు నన్ను తిట్టి వాళ్ల పార్టీలో పాపులారిటీ పొందాలని చూస్తాన్నరని వారికి కరీంనగర్ నియోజకవర్గ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.

అభివృద్ధికి నిధుల కొరతలేదు
కరీంనగర్ అభివృద్ధికి నిధుల కొరత లేదని, నగరంలోని ఎవరు కూడా మా ఇంటి ముందు రోడ్డు లేదని చెబితే తక్షణమే మంజూరు చేస్తామని గంగుల కమలాకర్ అన్నారు. ఇందుకోసం రూ. 25 కోట్ల నిధులను బఫర్ కింద పెట్టుకున్నామన్నారు. మరో 125 కోట్లతో నగరంలోని మిగిలిపోయిన మేయిన్ రోడ్లన్నీ నిర్మిస్తున్నామని అన్నారు. వక్ఫ్ బోర్డు భూములపై ప్రతి ఎన్నికల సమయంలో నాపై కొందరు చేసే ఆరోపణలు సరికావు అన్నారు. ఎమ్మెల్యే కాకముందు 2008లోనే అన్ని రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే భూములు కొనుగోలు చేశానని మంత్రి పేర్కొన్నారు.

వారు చేసే ఆరోణలను ఎవరు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. కరీంనగర్ అభివృద్ధి లక్షంగా సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ సహకారంతో వేలాది కోట్ల నిధులు తీస్తుకొచ్చి కరీంనగర్ రూపు రేఖలు మార్చమన్నారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధిని చూసి బిఆర్‌ఎస్‌లోకి రావాలని చూస్త్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఎవరూ ఉహించని విధంగా బిఆర్‌ఎస్‌లో చేరికలుంటాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ సమాశంలో కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు. బిఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, శ్రీలత, బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News