Saturday, April 27, 2024

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Minister Gangula planted saplings in Palle Pragathi program

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుళ్ల గ్రామంలో శనివారం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, మహిళా, గౌడ సంఘ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంతో పల్లెలన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయని.. భావితరాల భవిష్యత్ కు చెట్లు ఆస్తి అని.. మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు చెట్లు దోహదం చేస్తాయని తెలిపారు. పల్లెప్రగతి తో గ్రామాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ తెలంగాణలోప్రారంభించారని చెప్పారు. హరితహారం కార్యక్రమంతో పల్లెలన్నీ పచ్చగా దర్శనమిస్తున్నాయి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పల్లెలన్నీ అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో మొగులు చూసి దుక్కి దున్నేవారని,  కాలిన కరెంటు మోటార్లు ఎండిన మొక్క కంకులతో నిరసనలు ఉండేవని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాళేశ్వరం నీళ్ళు, నాణ్యమైన 24 గంటల కరెంటుతో బీడు భూములను సస్యశ్యామలంగా మారాయని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు వారి అకౌంట్ లో మూడు రోజుల్లో డబ్బులు వేస్తుందని పేర్కొన్నారు. దేశంలో రైతుకు సరిపడా విత్తనాలు ఎరువులు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు జోడెద్దుల పరిగెడుతున్నాయని.. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమఅగర్వాల్,జిల్లా పరిషత్ చైర్మన్ కనమల్ల విజయ జెడ్ పిటిసి పురమల్ల లలిత వైస్ ఎంపిపి వేల్పుల నారాయణ,సర్పంచ్ బలుసుల శారద,ఉపసర్పంచ్ ముత్యం శంకర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఎండి సర్వర్, జువ్వాడి రాజేశ్వరరావు, బుర్ర రమేష్,సుంకిషాల సంపత్ రావు,ప్యాక్స్ చైర్మన్లు బల్మురిఆనందరావు ,పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News