Sunday, April 28, 2024

మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్

- Advertisement -
- Advertisement -

ఇంటి వద్దనే ఆమెకు వైద్య సేవలు
మరో మూడు రోజుల్లో కోలుకుంటారంటున్న వైద్యులు

మన తెలంగాణ / హైదరాబాద్ : అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరం తో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రి జ్వరం బారిన పడ్డారు. దీంతో తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి వద్ద నుంచే ఆమె పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఐదు రోజులగా జ్వరం తగ్గకపోవడంతో డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే మంత్రిత్వశాఖల పరంగా రోజువారి కార్యక్రమాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర సమీపిస్తుండడంతో ఈ మేరకు మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన పలు సూచనలు చేస్తున్నారు. డెంగ్యూ నుండి మరో రెండు, మూడు రోజుల్లో కోలుకొని మేడారం సమ్మక్క, సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారని వైద్యులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News