Monday, April 29, 2024

కిషన్ రెడ్డికి సవాలు విసురుతున్న…. రెడీనా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హౌజింగ్ సైజ్ నిర్మాణం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతున్నాయా? అని,    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి సవాలు చేస్తున్నానని మంత్రి కెటిఆర్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కెటిఆర్ మీడియాలో మాట్లాడారు. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించామని చూపెడుతానని, స్లమ్ ఏరియాల్లో 10 వేల ఇండ్లు కడుతున్నామని, గ్రీన్ ఫీల్డ్‌లో 50 వేల ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని కెటిఆర్ అన్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, రిపోర్ట్ రాగానే పిఆర్‌సి అమలు చేస్తామని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. సిఎం కెసిఆర్ మనస్సులో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయని పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేస్తామని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, అందుకే టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండని కోరారు. కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలలో మరోసారి బుద్ధి చెబుతారని, చెరువుల సుందరీకరణ జరుగుతోందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెసోళ్లు మేనిఫెస్టోలో పెడుతున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఐదు రూపాయల భోజనం తిని మాజీ మంత్రి వర్యులు జానారెడ్డి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు హామీలు ఇస్తే ఎవరు నెరవేర్చుతారని అడిగారు. కొత్త మున్సిపల్ చట్టం కఠినంగా అమలు చేయడం మున్సిపల్ మంత్రిగా నాకు సవాల్ విసిరారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలు సరైన సమయానికే జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News