Monday, April 29, 2024

గ్రంథాలయ సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: వికారాబాద్ జిల్లా గ్రంథాలయములో కోటి 70 లక్షల రూపాయలతో నిర్మించిన రీడింగ్ హాల్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రంథాలయ శాఖలో భారీ సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు.

ఉమ్మడి జిల్లాలో వికారాబాద్ కేంద్రంగా ఉన్న జిల్లా లైబ్రరీలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూనే నూతనంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జిల్లా గ్రంథాలయాలు నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో పోటీ పరీక్షల అభ్యర్థులకు లైబ్రరీలలో మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు, డిమాండ్‌కు అనుగుణంగా బుక్స్ సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో 10 వేల రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ నెల 20 విద్యా దినోత్సవం నాడు వీటిని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీలు ముందుకు వస్తే రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్ల కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి తెలిపారు. వికారాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News