Wednesday, May 8, 2024

మరో 10,105 ఉద్యోగాల భర్తీ

- Advertisement -
- Advertisement -

Ministry of Finance allowing replacement of 10105 jobs

ఆర్థిక శాఖ అనుమతి, ఉత్వర్వులు జారీ

మన హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకుల విద్యాలయాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. బిసి గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్‌సి గురుకులాల్లో 2,267 పోస్టులు ఉ న్నాయి. ఈ పో స్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల ని యామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఎస్‌సి అభివృద్ధిశాఖలో 316, మహిళా శిశు సంక్షేమశాఖలో 251, బిసి సంక్షేమశాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగుల విభాగంలో 71. జువైనల్ వెల్ఫేర్ 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయనున్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా అ నుమతితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45.325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విటర్ ద్వారా ఆర్థికమంత్రి హరీశ్ రా వు వెల్లడించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45వేలకు పైగా ఉ ద్యోగాల భర్తీకి అనుమతిచ్చినట్టు పే ర్కొన్నారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. కొంతమంది ఉద్యోగ ప్రకటనలు మాత్రమే చేస్తారని, ప్ర భుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, త్వరలో మరిన్ని ఉద్యోగాల నో టిఫికేషన్‌లను విడుదల చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News