Friday, May 17, 2024

‘అగ్నిపథ్’ అదనపు అర్హతే

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ ఘటనపై విచారణ జరపాలి
హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ విధ్వంసంపై చర్చించారు. అనంతరం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కుట్రపూరితంగానే అగ్నిపథ్ పై ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఈ స్కీమ్ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అగ్నిపథ్ లో చేరడం అదనపు అర్హత అని స్పష్టం చేశారు. ఈ తరహా విధానం మెక్సికో, సింగపూర్, థాయిలాండ్ దేశాల్లో అమల్లో ఉందని గుర్తు చేశారు. ఇండియాలో ఇది తప్పనిసరి కాదని… దేశ భక్తి, నైపుణ్యం పెంచే ప్రయత్నం ఈ పథకం ఉద్దేశ్యమని తెలిపారు. స్వచ్ఛందంగా ఇష్టపడే వాళ్లే చేరవచ్చని వెల్లడించారు. ’ఆందోళనల ఫలితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఉదయం నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రయాణికులను భయపెట్టిన పట్టించుకోలేదు. నిన్న రాజ్ భవన్ ముట్టడి సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రధాన గేట్ వద్దకు వచ్చారు. వీటన్నింటి వెనుక కుట్ర ఉంది. నిజానికి శాంతిభద్రతల బాధ్యత రాష్ట్రానిదే. ఈ ఘటనలన్నీ ప్రణాళిక ప్రకారం జరిగాయి. ఆర్పీఎఫ్ లా అండ్ అర్డర్ బాధ్యతలు చూడదు. ఇందతా రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి. రైల్వే కోచ్ లు తగలబెట్టినా ఎందుకు ఆపలేకపోయారు..? ఆందోళన జరుగతుందని తెలిసి పోలీసులు రాలేదు..? వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు. యువతకు అన్యాయం చేయలేదనేది తమ విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారు తమ దృష్టికి సమస్యలు తీసుకువస్తే మాట్లాడుతామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News