Monday, April 29, 2024

నల్లజాతికి సరికొత్త ఊపిరి

- Advertisement -
- Advertisement -

Minneapolis court has ruled in favor of George Floyd

ఫ్లాయిడ్ కేసులో పోలీసే హంతకుడు
దోషిగా నిర్థారించిన న్యాయస్థానం
3 అభియోగాలు.. శిక్ష 40 ఏండ్లు?

వాషింగ్టన్ : అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకేసులో మినియాపొలిస్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా నిర్థారిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది మే 25వ తేదీనకిలీ నోట్ల సరఫరా ఆరోపణలతో 46 ఏండ్ల ఫ్లాయిడ్‌ను పట్టుకునే నెపంతో ఆయన మెడమీద కాలుపెట్టి తొమ్మిది నిమిషాల పాటు పోలీసు అధికారి నులిమివేయడం, ఈ దశలో వదిలిపెట్టండి, ఊపిరి ఆడటం లేదని ప్రాధేయపడ్డా విన్పించుకోకపోవడం వంటి పరిణామాలు,ఊపిరి ఆడకపోవడం వల్లనే ఫ్లాయిడ్ మృతి చెందాడనే నిర్థారణకు రావడంతో చౌవిన్‌ను ఈ సంచలనాత్మక కేసులో దోషిగా ఖరారు చేశారు. త్వరలోనే శిక్ష విధించారు. సెకండ్ డిగ్రీ ఉద్ధేశపూర్వక హత్య, థర్డ్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీమ్యాన్‌స్లాటర్ అంటే నరహంతక చర్యల వంటి అభియోగాలతో ఈ పోలీసు అధికారి దోషిగా నిర్థారణ అయినట్లు సంబంధిత న్యాయస్థానానికి చెందిన 12 మంది న్యాయమూర్తులు నిర్థారించారు.

ఆఫ్రో అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ గొంతు నులిమి ఊపిరితీసిన ఈ ఘటన అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అరెస్టులో ఉన్న పోలీసు అధికారి బెయిల్‌ను రద్దుచేశారు. ఇప్పటి తీర్పుపై అమెరికాలో హర్షం వ్యక్తం అయింది. ఈ రోజు మేం మళ్లీ ఊపిరి తీసుకుంటున్నాం అనే ప్లకార్డులతో తిరిగిన వారి వెంట ఫ్లాయిడ్ సోదరుడు కూడా ఉన్నారు. దోషిగా నిర్థారణ అయిన పోలీసు అధికారికి చట్ట ప్రకారం 40 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నల్లజాతి అమెరికన్లకు జరిగిన న్యాయం అమెరికన్లందరికీ జరిగిన న్యాయం అని ఈ కేసు అమెరికాలోని భద్రతా సిబ్బంది ప్రజానీకం పట్ల కనబర్చాల్సిన కనీస ధర్మాన్ని తెలియచేస్తుందని ఫ్లాయిడ్ కుటుంబ లాయర్లు బెన్ క్రంప్, జార్జి ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు స్పందించారు.

న్యాయ కల్పనలో ఇది కీలకం ః బైడెన్

ఫ్లాయిడ్ దారుణాంతం ఘటనలో వెలువడ్డ న్యాయం వివక్ష వ్యతిరేక పోరాటంలో కీలక పరిణామం అని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాకూడదని, ఈ తీర్పు ఈ దిశలో ఉత్తేజిత సందేశాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇంతటితో న్యాయసాధన ఘట్టం అయిపోలేదని,ఇది ఇంతటితో ఆగిపోదని, అణచివేతలు లేకుండా చేసే స్థాయి వరకూ ఇటువంటి న్యాయపోరాటాలు సాగుతాయనితెలిపారు. ఇప్పుడు వెలువడ్డ న్యాయం అమెరికాలో న్యాయం నిలబడ్డ రోజుకు ప్రతీక అని దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులను వైట్‌హౌస్‌కు పిలిపించి మాట్లాడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News