Saturday, April 27, 2024

తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?

- Advertisement -
- Advertisement -

Modi govt faction on Telangana

రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు… రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి సాగు నీటిని ఇచ్చి, రైతు బీమా ద్వారా వారి కుటుంబానికి భరోసాను కల్పించి రైతు సంక్షేమ రాజ్యాంగా నిలిచి దేశంలోనే అత్యధికంగా వరిని పండించేడమే కాకుండా పంజాబ్ రాష్ట్ర సరసన నిలిచింది. మన తెలంగాణ రాష్ట్రం… దేశంలో 27 రాష్ట్రాలను వెనక్కి నెట్టి వడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంకు చేరింది. అని చెప్పడం అతిశయోక్తి కాదు… అది మన రైతుల విజయంగా… మన రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనంగా అభివర్ణించవచ్చు… కానీ ఆ విజయానికి వంకలు పెడుతూ… రాష్ట్ర ప్రభుత్వ కఠోర శ్రమకు ఉరిని బిగిస్తూ… పండిన పంటకు పరిమితిని విధిస్తుంది కేంద్రం… రాష్ట్రాల పంటలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) ద్వారా కొనాల్సింది కేంద్ర ప్రభుత్వం.

కానీ ఆ బాధ్యతలను విస్మరిస్తుంది… అయితే ఈ 2020-21లో పండిన పంటలో కేవలం 60 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొంటామని పునరుద్ఘ్ఘాటించింది. 2020 -21 యాసంగిలో అసలు బాయిల్ బియ్యాన్ని అస్సలే కొనబోమని కొర్రీలు పెడుతూ రాష్ట్ర రైతాంగాన్ని నిండా ముంచుతుంది… మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నం పాలు చేస్తోంది…

ఉమ్మడి రాష్ట్రంలో కరువు కటకాలతో నెర్రలు బారిన తెలంగాణ బీడు భూములకు రాష్ట్ర ఏర్పాటు అనంతరం కృష్ణా- గోదావరిని మళ్లించి స్వయం సమృద్ధితో ఏడేండ్ల అనతి కాలంలోనే దాదాపు 5 రెట్లు ఎక్కువగా పంటను పండించడం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందా! అనే రీతిలో కేంద్రం బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తోంది.2014-15 లో 23 లక్షల టన్నుల వరి ధాన్యా న్ని ఉత్పత్తి చేయగా 2015-16 లో 24 లక్షల టన్నులు, 2016-17లో 53 లక్షల టన్నులు కాగా, 2017-18లో 54 లక్షల టన్నులు కాగా, 2018-19 లో 78 లక్షల టన్నులయితే అనతికాలంలోనే 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 111 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయగా… 2020 -2021 ఆర్ధిక సంవత్సరంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు… ఈ సాగులో దాదాపు 1.40 లక్షల టన్నుల ధాన్యం వచ్చింది.. ఇంత మొత్తంలో ధాన్యం పండించినందుకు సంతోషపడాల… ఏడవాల అనే రీతిలో కేంద్రం పేచీ పెడుతుంది. ఎందుకంటే వానా కాలం ధాన్యంలో కేవలం 60 లక్షల టన్నులు మాత్రమే స్వీకరిస్తామని చెబుతోంది… మరి దీనికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం కరోన విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ సేకరించిన 70 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికే గోదాముల్లో నిల్వ ఉంది … అంటే మొత్తం 2.10 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణలో అందుబాటులో ఉండగా అందులో కేంద్రం 60 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఇంకా మిగిలిన 1.50 లక్షల టన్నుల ఎవరికి విక్రయించాలి.

ఈ మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర అవసరాలకు, ఇతర అవసరలకు పోను మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలి… మొత్తం ధాన్యం సేకరిస్తాం అని చెప్పిన కేంద్రం పరిమితిని ఎందుకు విధిస్తున్నది. అసలు మతలబు ఏంటి…? వానా కాలం పారబాయిల్ బియ్యం రావు కదా..! మరి పరిమితి ఎందుకు..?
పెద్దన్న పాత్ర వహించాల్సిన కేంద్రం ఇప్పటి వరకు గడిచిన ఏడేండ్లలో 485 లక్షల టన్నుల ధాన్యాన్ని మన తెలంగాణ నుండి సేకరిస్తే ఉదా పంజాబ్ నుండి 1135 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినపుడు తెలంగాణ వడ్లను మొత్తం ఎందుకు సేకరించడం లేదు.. ఈ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమే కాదా! దీన్ని కేంద్రం ఎందుకు విస్మరిస్తుంది. వడ్లను కొననని కేంద్రం చెప్పిందా అని స్వయానా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పత్రిక సమావేశంలో ప్రకటించడం రాజకీయ స్వార్ధమే కదా.! రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల వైపుకు మరల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రైతాంగానికి సూచనలు పంపుతున్నప్పటికి… కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొసలి కన్నీళ్లు పెట్టుకుంటుంది..

కిషన్ రెడ్డి పత్రికా సమావేశంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మరల్చాలి అని ప్రస్తావించినపుడు… మరి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అండ్ కో మాత్రం… వరిని మీరెట్ల వద్దంటారని రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు ఎట్లా చేస్తరు…? ఒక వైపు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉదా॥ హర్యానాలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్న బిజెపి మన రాష్ట్రంలో ఎందుకు అమలు పర్చడం లేదు… మన రాష్ట్ర బిజెపి మాత్రం వరిని ఎట్ల వద్దంటారని రైతులను మోసం చేస్తుంది… ఒకవైపు కేంద్రం వరిని వద్దంటుంటే రాష్ట్ర బిజెపి వరిని మాత్రమే పండించాలని రైతులను మోసం చేసే ప్రక్రియకు ఒడిగట్టింది..

ఇక యాసంగి పంట విషయానికి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల వలే మన రాష్ట్రంలో కూడా అధిక ఉష్ణోగ్రతల వలన వరిగింజ పగిలి నూక అవడం సహజమే. యాసంగి ధాన్యాన్ని బాయిల్ చేస్తనే మంచి బియ్యం వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వడ్లను బాయిల్ చేసి రైతుకు నష్ట నివారణ చర్యలు మన రాష్ట్రం చేస్తుంటే… మరి కేంద్రం అన్ని రాష్ట్రాల్లో బాయిల్ ధాన్యాన్ని సేకరించి మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొనకుండా వివక్ష చూపడం దేనికి సంకేతం… కేంద్రం ఒక గింజ పారబాయిల్ ధాన్యాన్ని కొనమని చెపితే రాష్ట్ర రైతాంగంను పరిస్థితి ఏంటి..? ఒక వైపు కేంద్రం వారిని కాకుండా ప్రత్యామ్నాయ పంటలను పండించాలని అంటుంది. కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విషయాన్ని రైతాంగానికి చెపితే ఇక్కడి రాష్ట్ర బిజెపి నాయకత్వం అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర బిజెపి ఆమోదించడం లేదని ఇలాంటి ప్రకటనల ద్వారా తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిన మాట వాస్తవమే.

ఈ వరి ఉత్పత్తి నుండి రైతులను ఇతర పంటల వైపు మరల్చడానికి తీవ్రంగా కృషి చేస్తుంది.. అయితే ఇప్పటికిప్పుడు పంట మార్పిడి చేయడమనేది సాధ్యం కాదు. పంట మార్పిడిపై మెలుకువలు ఇచ్చేందుకు ప్రభుత్వం నియమించిన రైతు బంధు సమితిలు, వ్యవసాయ విస్తరణ అధికారులు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఇది ఆచరణలో సాధ్యమయ్యేలా కనిపిస్తుంది. అంతవరకు తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనాల్సి ఉంది. కానీ ఆ బాధ్యతల నుంచి సునాయాసంగా వాస్తవ రహిత కారణాలు చెప్పుతూ పక్కకు తప్పుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో పంటలు పండక ఏడ్చినం – సొంత రాష్ట్రంలో పంటలు పండుతే ఏడవాల్సిన స్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. దీనికి కారణం ఎవరు…?

246 రాజ్యాంగ నిబంధన ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను ఏ రాష్ట్రంలోనైన మద్దతు ధర ఇచ్చికొనాల్సిన బాధ్యత కేంద్రానిది… మరి పారబాయిల్ నిల్వలు నాలుగేండ్లకు సరిపడ ఉన్నప్పుడు… దేశంలో తినడానికి తిండి లేని దాదాపు 28 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు దేశ ఆహార పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేసి నిల్వలను తరలించలేదా? నూతనంగా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదా? ఉన్న ధాన్యాన్ని లెనోడికి పెట్టక పస్తులుంచి.. పండించిన రైతు పంటను కొనకుండా ఈ విధంగా పస్తులుంచవచ్చా!

సమాఖ్య వ్యవస్థలో కేంద్ర- రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ప్రతిబింబించేలా ఉండాలే కానీ కక్ష సాధింపుగా ఉండకూడదు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభు త్వం సవతి తల్లి ప్రేమను పోషిస్తే సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం వాటిల్లదా.! దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం ఉత్తరాది రాష్ట్రాలను ఒకలాగా దక్షిణాది రాష్ట్రాలను మరోలాగా చూస్తుండడం వివక్షే కదా! ఉదా॥ పంజాబ్ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అక్కడి మొత్తం పంటను కేంద్రం కొంటున్నప్పుడు… మరి మా తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పండిన పంటకు వంకలేందుకు? నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అంటున్న కేంద్రం ఎంత సామర్థ్యంలో ధాన్యం వచ్చిన నిల్వ చేసే గోదాములను భారత ఆహార సంస్థ కలిగి ఉంది కదా మరి ఎందుకు చేయడం లేదు? డిమాండ్ సప్లయ్‌కి అనుగుణంగా విదేశాంగ విధానం ద్వారా వివిధ దేశాల నుండి మన వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నట్టే మన దేశం కూడా ప్రపంచంలో వడ్లు పండకుండా బియ్యం అవసరమున్న దేశాలు చాలా ఉన్నాయి కదా మరి అలాంటి దేశాలతో ఒప్పందం కుదుర్చుకుని బియ్యాన్ని ఎగుమతి చేసి దేశ రైతాంగానికి మేలు చేకూర్చవచ్చు కదా… అంతే కాకుండ వరికి ప్రత్యామ్నాయంగా మనం వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న అనేక పంట వస్తువులను మన దేశ వ్యవసాయ విధానాన్ని అనుసరించి వివిధ రాష్ట్రాలకు ఆ పంటలను దేశీయ పద్ధతిలో పండించే సామర్ధ్యం ఉన్నప్పుడు ఆ విధంగా ప్రోత్సహించే ఆలోచన కేంద్రం ఎందుకు చేయడం లేదు.. వివిధ దేశాల నుండి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బదులు మన దేశ రైతాంగాన్ని అందుకు అనుగుణంగా ప్రోత్సహించి ఆ మేలును మన దేశ రైతాంగానికి చేకూర్చవచ్చు కదా !

కేంద్ర- రాష్ట్ర సంబంధాల దృష్ట్యా రాష్ట్రంలో పండిన ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే… ఆ బాధ్యతలను విస్మరించరాదు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని పూర్తిగా కొనడం కేంద్రం బాధ్యతనే… కానీ ఆ బాధ్యతలను విస్మరిస్తూ తెలంగాణ రైతాంగాన్ని నిలువుగా ముంచే ప్రయత్నం చేస్తే ఇక్కడున్నా తెలంగాణ ప్రభుత్వం, సమాజం ఉరుకునే ప్రసక్తే లేదు… తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో కేంద్రంతో రాజీలేని పోరాటం చేయటానికి ప్రభుత్వం వెనుకడుగు వేయదు… అంతేకాక తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న స్థానిక బిజెపి నాయకత్వాన్ని అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర బిజెపిదే.

పిన్నింటి
విజయ్ కుమార్ 9052039109

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News