Monday, April 29, 2024

మోడీ నెం.1

- Advertisement -
- Advertisement -

Modi Tops List Of Most Popular World Leaders

బైడెన్‌కు ఆరో స్థానం…చివరి స్థానంలో జపాన్ ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోడీ అగ్రస్థానాన్ని సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ లీడర్ మార్నింగ్ కన్సల్ట్ అనే పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ తాజాగా రేటింగ్‌లను విడుదల చేసింది. సదరు సర్వే ఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకూ కలెక్ట్ చేసిన సమాచారం ప్రకారం భారత ప్రధాని 71 శాతం రేటింగ్‌తో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత 66 శాతం రేటింగ్‌తో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ రెండో స్థానంలోను, 60 రేటింగ్‌తో ఇటలీ దేశానికి చెందిన మారియో డ్రాఘీ మూడో స్థానం సంపాదించారు. చివరి స్థానంలో జపాన్ ప్రధాని సుగా నిలిచారు.

ఈ సంస్థ 13 మంది ప్రపంచంలోని నాయకుల జాబితాను తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 43 శాతం రేటింగ్‌తో ఆరోస్థానంలో నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో కూడా 43 శాతం రేటింగ్ సాధించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 41 శాతం రేటింగ్‌ను సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇండియా, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యూనైటెడ్ కింగ్‌డమ్, యూనైటేడ్ స్టేట్స్‌లో ప్రభుత్వ నాయకులు, ప్రజల్లో వారి పట్ల ఉన్న ఆదరణపై సర్వే నిర్వహిస్తుంది. మోడీ 2020లో కూడా 84 శాతం రేటింగ్‌తో అగ్రస్థానం పొందారు. అయితే, 2021లో మాత్రం ఆయన రేటింగ్ 63 శాతానికి పడిపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News