Saturday, April 27, 2024

భారత్-అమెరికా డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ఉగ్రవాదం ఇప్పటికి ప్రమాదకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో చారిత్రాత్మకంగా గంట పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది యుద్ధాల యుగం కాదని మరోసారి చెబుతున్నానని, రక్షణ దిగుమతుల్లో భారత్‌కు అమెరికా కీలక భాగస్వామి అని ప్రశంసించారు. భారత్ పెద్దగా ఎదగడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత దేశం అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. మోడీ ప్రసంగిస్తుండగా ఆద్యంతం చప్పట్లతో సభ మార్మోగిందన్నారు. మోడీ…. మోడీ… అంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు నినదించారు. ఆమెరికా-బైడెన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్-అమెరికా సంబంధాల్లో ముఖ్యమైన రోజు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Also Read: ఎమ్మెల్సీ కవితను గజమాలతో సత్కరించిన మమతాగుప్తా

భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రశంసించారు. వాణిజ్య సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామని, బెంగళూరు, అహ్మదాబాద్‌లో కాన్సులేట్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సహకారం విస్తరిస్తోందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా ఉమ్మడి పోరాటం చేస్తుందని ప్రశంసించారు. జనరల్ ఎలక్ట్రిక్, హెచ్‌ఎఎల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమన్నారు. ఇరుదేశాల భాగస్వామ్యానికి సుస్థిరత అభివృద్ధి కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచ శాంతి కోసం భారత్-అమెరికా కలిసి పని చేస్తాయని మోడీ కొనియాడారు. సియాటెల్‌లో కొత్త కాన్సులేట్ ప్రారంభిస్తామని, భారత్-అమెరికా భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం చేపడుతున్నామని, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు భారత్ ఒత్తిడి చేస్తోందని, భారత్-అమెరికా డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఉందని మోడీ స్పష్టం చేశారు. భారత్‌లో వివక్షకు తావులేదని, కృతిమ మేథస్సు, సెమీ కండక్టర్ అంశాలే ప్రధానంగా చర్చలు జరుపుతున్నామన్నారు. జి-20 హామీలను నిలబెట్టుకున్న ఏకైక దేశం భారత్ అని ప్రశంసించారు. హరిత హైడ్రోజన్ కేంద్రంగా భారత్ అవతరించనుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News