Friday, April 26, 2024

‘ఆదిపురుష్’లో కీలకపాత్రలో..?

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ అభిమానులు ‘బుజ్జిగాడు’ సినిమాని అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ స్టార్ హీరో కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలిచిన ఈ సినిమాలో మోహన్‌బాబు ఓ ప్రత్యేకమైన పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ప్రభాస్, మోహన్‌బాబుల మధ్య వచ్చిన సీన్లన్నీ పోటాపోటీగా పండాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి మ్యూజిక్ చూసే అవకాశం దక్కబోతోంది. ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపిస్తాడని చిత్రబృందం ఇప్పటికే తెలియజేసింది. ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం మోహన్‌బాబుని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ‘ఆదిపురుష్’ ప్రాజెక్టుకి కొత్త కళ వచ్చినట్టే. ఇటీవల ‘మహానటి’లోనూ ఓ కీలకమైన పాత్ర పోషించారు మోహన్‌బాబు. అందులో ఆయన ఎస్వీఆర్‌గా మెప్పించారు. ఈసారి మోహన్‌బాబు పాత్ర ప్రత్యేకంగా ఉండనుందని తెలిసింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Mohan Babu key role in Adi Purush Movie?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News