Monday, April 29, 2024

విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలి

- Advertisement -
- Advertisement -

టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫరూఖీ

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని టిఎస్‌ఎస్‌డిసిఎల్(దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ) సీఎండి ముషారఫ్ ఫరూకీ తెలిపారు. మంగళవారం మింట్ కంపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఈ సందర్శంగా ఆయన మాట్లాడుతూ ఏ సంస్థకైన వినియోగదారుడే ముఖ్యమని అటువంటి వినియోగదారులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. అదే విధంగా సంస్థకు నష్టం వాటిల్లే చర్యలను సహించేది లేదని, విద్యుత్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ఇందులో బాగంగా తనిఖీలను కూడా నిర్వహించాలన్నారు.

క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్లు అందుబాటులో ఉండాలని ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. తాము క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆయన హెచ్చరించారు.వినియోగ దారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్వీకరించి తక్షణ పరిష్కార మార్గం చూపించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News