Monday, April 29, 2024

టైమ్ విశిష్ట వ్యక్తుల్లో 8 మంది భారతీయులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఈ ఏడాది 2023 ముగింపు దశలో టైమ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాను వెలువరించింది. వందమందితో కూడిన ఈ తొట్టతొలి లిస్టులో ఎనమండుగురు భారతీయులు, భారతీయ సంతతికి వ్యక్తులు (పిఐఒ) ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ, వ్యాపారం వంటి పలు రంగాల్లో సేవలను అందించి, ప్రభావం చూపిన వారిని గుర్తించి వీరిని జాబితాలో చేర్చారు. ఈ ప్రముఖుల వరుసలో చేరిన వారిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షులు అజయ్ బంగా,ఓలా ఎలక్ట్రిక్ సారధి భవిష్య్ అగర్వాల్ వంటి వారు ఉన్నారు. టైమ్ విశిష్టుల జాబితాలో పలువురు సిఇఒలు, సంస్థల వ్యవస్థాపకులు, సంగీతకారులు, దాతృత్వవేత్తలు, విధానకర్తలు , పలువురు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ప్రత్యేకించి పలువురు పర్యావరణ హితానికి పాటుపడుతున్న వారి పేర్లు కూడా ఇందులో చోటుచేసుకున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి యుఎఇలో ఆరంభమయ్యే 2023 వరల్డ్ క్లెమెట్ సమ్మిట్ నేపథ్యంలో ఈ జాబితా వెలువడింది. ప్రపంచ బ్యాంకు అధినేతగా ఇప్పుడు ఉన్న అజయ్ బంగా భారతీయ మూలాల గురించి తెలిసిందే.

పేదరిక నిర్మూలనతో పాటు ఆయన ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు వినూత్న రీతిలో పాటుపడుతున్నట్లు గుర్తింపు దక్కింది. ఈ వంద మంది జాబితాలో రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ జె షా, గీతా అయ్యర్ , మనోజ్ సిన్హా , మహీంద్రా లైఫ్ సైన్సెస్ సిఇఒ , ఎండి అమిత్‌కుమార్ సిన్హా , జిగర్ షా వంటి వారి పేర్లు చోటుచేసుకున్నాయి. పలు రంగాలలో వినూత్న , సృజనాత్మక పరిణామాలకు దారితీసే ప్రక్రియలకు, ఆలోచనలకు దిగుతున్న వారిని గుర్తించి వీరి ప్రతిభను అంతర్జాతీయంగా చాటిచెప్పడం తమ బాధ్యతగా భావించి ఈ వంద మంది విశిష్టుల జాబితాను వెలువరించినట్లు టైమ్స్ మేగజైన్ తెలిపింది. ప్రపంచం పర్యావరణ హితం అయితేనే భవిత ఉంటుందని, ఈ క్రమంలో ఎటువంటి కీలక పాత్ర అయినా అది రేపటి తరానికి మేలు చేసే మైలురాయి అవుతుందని, ఈ క్రమంలోనే తాము ఈ జాబితాను ఏర్చికూర్చి రూపందించినట్లు టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ సామ్ జాకబ్స్ ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News