Monday, April 29, 2024

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్

- Advertisement -
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఇదివరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ మూడో పాటతో అలరించేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఈ మూడో పాట రాబోతోంది. ఇందులో భాగంగా ఈనెల 17న సాంగ్ టీజర్ కూడా రాబోతోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ స్పెషల్ సాంగ్‌లో నాగార్జున, నాగచైతన్యల సరసన స్టెప్పులు వేసింది. మొదటిసారిగా మ్యూజిక్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పోస్టర్ ద్వారా సాంగ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. ఇక ఇందులో అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఫరియా అబ్దుల్లాతో కలిసి చిందులు వేస్తున్నారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా.. నాగచైతన్య మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఫరియా మాత్రం హుషారైన లుక్‌లో కనిపించింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News