Friday, April 26, 2024

ప్రమాదకరంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఫుట్ ఓవర్ బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ ఇనుప బ్రిడ్జి బలహీనమై… అటు ఇటు, కిందకి కదులుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనంటూ ఒక్కసారిగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు.. నాలుగు వైపులా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా కనిపిస్తోంది. జాప్యం చేస్తే కనుక రైల్వే ఆస్తులు, ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నది. స్థానికుల సౌకర్యార్దం 40 ఏళ్ల క్రితం జంగంబస్తీ రైల్వే క్వార్టర్స్ నుంచి పబ్లిక్‌గార్డెన్స్‌లోపలి నుంచి ఆవతల వైపు వెళ్లేందుకు వీలుగా రైల్వే శాఖ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించింది. నేటికి మరమ్మతులు లేక బ్రిడ్జి అధ్వాన్న దుస్థితి చూసేవారిని వణికిస్తోంది. పలు చోట్ల బీటలు వారి, పగుళ్లు ఏర్పడ్డాయి. ఏ క్షణాన ఒక్కసారిగా పట్టాలపై కూలేందుకు సిద్దంగా ఉంది. బ్రిడ్జి కింద నుంచే విద్యుద్దీకరణ లైన్లు, 24 గంటలు రైళ్ల నుంచి వెలువడే పోగ, వేడి సేగల ధాటికి బ్రిడ్జి క్రమంగా బలహీనమవుతోంది.

బ్రిడ్జి కింద బాగాన నల్లగా మారి నేలమట్టం అయ్యేలా ఉంది. బ్రిడ్జి మద్యలో కిందికి వంగడం, అటు ఇటు కదులుతున్న వైనాన్ని స్వయంగా రైల్వే ఇంజినీర్ల బృందం తనిఖీలు చేసి ఆందోళనకు వ్యక్తంచేసింది. ఈ బ్రిడ్జి నాలుగు వైపులా బలహీనమవుతోంది. యుద్దప్రాతిపదికన కూల్చివేయాలి, పక్కనే ప్రత్యామ్నాయంగా మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే వర్గాలకు ప్రతిపాదనలు చేసింది. రైల్వే ఆస్తులు, ప్రయాణీకులకు ఏ మాత్రం సురక్షితం కాదని వెంటనే మూసివేయాలని, పై నుంచి రాకపోకలు బంద్ చేయాలని తేల్చిచెప్పింది. వారి సూచనలను రైల్వే వర్గాలు తీవ్రంగా పరిగణించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నెలరోజుల క్రితమే బ్రిడ్జిపై నుంచి పాదచారుల రాకపోకలు పూర్తిగా నిలిపివేసి బ్రిడ్జిని మూసివేశారు. దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న బ్రిడ్జికి మరమ్మతులు లేవు.

ప్రతి రోజూ వేల సంఖ్యలో స్థానికులు. బస్తిపరిసర వాసులు రాకపోకలకు బ్రిడ్జి ప్రదాన మార్గం.. జంగంబస్తీ, రెడ్‌హిల్స్, బజార్‌ఘట్, గోకుల్‌నగర్, షేర్‌గల్లీ, రైల్వే క్వార్టర్స్ స్థానికులు నిత్యం బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఆలానే ఉద్యాన శాఖ వివిద సంస్థల ఆఫీస్‌లు, నర్సిరీ, నాంపల్లి క్రిమినల్ కోర్టులు, విద్యాసంస్థల ఉద్యోగులు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించడం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News