Saturday, April 27, 2024

అంగారకునిపైకి నాసా మరో రాకెట్ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

NASA's Mars 2020 Perseverance rover mission

వాషింగ్టన్ : అంగారక గ్రహంపై విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మార్స్ రోవర్ పెర్సీవరెన్స్ అనే పేరుతో మరో అట్లాస్5 రాకెట్‌ను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కాన్వెరాల్ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 7.50కి (భారత కాలమానం ప్రకారం గురువారం సా. 5.29) ఈ ప్రయోగం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఇది అంగారకు ని చేరుకుని మానవ ఉనికి ఆనవాళ్లను గుర్తించే పని ప్రారంభిస్తుంది. 2.4 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఈ రాకెట్‌లో చిన్న కారు వంటి ఆరు చక్రాల సైంటిఫిక్ వాహనంతోపాటు స్వయం చోదిత హెలికాఫ్టర్ వంటి డ్రోన్ ఉంటాయి. అంగారకునిపై పరిశోధనకు నాసా ఇప్పటివరకు చేపట్టిన ప్రయోగాల్లో ఇది తొమ్మిదోది కావడం విశేషం. అనుకున్న ప్రకారం ఈ రోవర్ అంగారకుని నమూనాలను సేకరించి భూమికి వచ్చే రాకెట్‌కు అందించ గలిగితే 2031 నాటికి శాస్త్రవేత్తలకు ఆ క్యాప్సూల్ అందుతుంది.

NASA’s Mars 2020 Perseverance rover mission

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News