Home జాతీయ వార్తలు కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ స్థానంలో గాడ్సే…. యువకుడు అరెస్ట్

కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ స్థానంలో గాడ్సే…. యువకుడు అరెస్ట్

Nathuram godse Photo on note instead of Gandhi

భోపాల్: కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేసి యువకుడిని అరెస్టు చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎబివిపికి చెందిన శివమ్ అనే వ్యక్తి నాథూరామ్ గాడ్సే బొమ్మను క్లోన్ చేసి పది రూపాయల నోట్ పెట్టాడు. అనంతరం ఆ నోట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎన్‌ఎస్‌యుఐ సభ్యులు శివమ్ ఫేస్‌బుక్‌లో లాంగ్ లివ్ నాథూరామ్ గాడ్సే ఫోటోను గమనించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మే 19న నాథురామ్ గాడ్సే జయంతి సందర్భంగా శివమ్ పోస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నాథూరామ్ గాడ్సే దేశాన్ని రక్షించారని కామెంట్ చేశాడు. దీంతో పోలీసులు ఐపి అడ్రస్ ద్వారా అతడిని గుర్తించి అరెస్టు చేశారు. ప్రతీది ఎబివిపి పేరును వాడుతున్నారని కాంగ్రెస్‌పై ఆ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. గాంధీని హత్య చేసినందుకు నవంబర్ 15, 1949న నాథూరామ్ గాడ్సేను అంబాలా జైలులో ఉరితీశారు.