Saturday, May 18, 2024

హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన

ఎన్‌సిడిసి ల్యాబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
నేడు హెల్త్ సెక్రటరీతో భేటీ కానున్న అధికారులు

Free Wifi in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎన్‌సిడిసి(నేషనల్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బ్రాంచ్) ల్యాబ్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రయోగశాల నిర్మాణం కొరకు స్థలాలను పరిశీలించాల్సిందిగా ఈనెల 3వ తేదిన హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఎన్‌సిడిసి డైరెక్టర్‌కు లేఖ రాసిన విషయం విధితమే. దీంతో ఎన్‌సిడిసి అడ్వైజర్ డా కె.ఎల్ రమేష్ బృందం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఎన్‌సిడిసి ల్యాబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన స్థలాలను సెంట్రల్ ఆఫీసర్లు పరిశీలించారు. అనంతరం శామీర్‌పేట్ పిహెచ్‌సి సందర్శించి అక్కడి సౌకర్యాలు, వైద్యవిధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఅంశంపై గురువారం హెల్త్‌సెక్రటరీ రిజ్వీతో కేంద్ర బృందం భేటీ కానుందని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ల్యాబ్‌ను అతి వేగంగా పూర్తి చేసి వ్యాధుల నిర్ధారణను వేగవంతం చేయనున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. సెంట్రల్ టీంలో డా రమేష్‌తో పాటు డా శిఖావర్ధన్, డా ప్రణాయ్ వర్మ, డా దారా షా, ఎస్‌హెచ్ రాజీవ్ కనానుజియాలు ఉన్నారు.
మూడు ప్రాంతాల్లో పరిశీలన
రాష్ట్రంలో ఎన్‌సిడిసి ల్యాబ్ కొరకు సెంట్రల్ టీం మూడు ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన తుర్కపల్లి (జీనోమ్ వ్యాలీ)లో ‘నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్’సంస్థ వద్ద, కర్కపట్ల వద్ద జీనోమ్ వ్యాలీ మూడో ఫేజ్‌లో కేటాయించిన స్థలం, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం కేటాయించిన స్థాలాలను సెంట్రల్ ఆఫీసర్లు పరిశీలించారు. మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ఆఫీసర్లుకు వివరించారు. తుర్కపల్లి వద్ద ఐసిఎంఆర్ ఆధీనం లో ఉన్న స్థలం కొంత బాగుందని, మిగిలిన రెండు ప్రాంతాలు బాగోలేవని సెంట్రల్ టీం అభిప్రాయపడింది. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్ వెనకాల ఉన్న పాతభవనంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని హెల్త్‌సెక్రటరీ సెంట్రల్ టీంని కోరారు. ఆ బిల్డింగ్, పరిసరాలు, కొలతల వివరాలను టిఎస్‌ఎంఎస్‌ఐడిసిఇంజనీర్లు ఎన్‌సిడిసి అధికారులకు పంపించినట్లు సమాచారం.

NCDC Team arrives Hyderabad for New Lab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News