Monday, April 29, 2024

ఎన్‌డిఎదే బీ’హారం’

- Advertisement -
- Advertisement -

NDA is poised to seize power in Bihar

 

మేజిక్ ఫిగర్ 122ను అందుకున్న కూటమి

గట్టి పోటీనిచ్చిన ఆర్‌జెడి నాయకత్వంలోని మహాకూటమి
సిఎం నితీష్ జెడియు కన్నా బిజెపికే అత్యధిక సీట్లు
ఎల్‌జెపి ప్రభావం శూన్యం, సత్తా చాటిన వామపక్షాలు
5 స్థానాల్లో ఎంఐఎం విజయబావుటా

పాట్నా: బీహార్‌లో ఎన్‌డిఎ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు సిద్ధమైంది. అధికార పీఠం దక్కించుకోవడానికి 122 స్థానాలు అవసరం కాగా రాత్రి 9 గంటల సమయానికి 122 స్థానాల్లో గెలుపు దిశగా ముందుకు సాగుతోంది. అధికార పీఠాన్ని అధిష్టించడానికి సి ద్ధమవుతోంది. అయితే పూర్తి ఫలితాలు వెలువడడానికి మరింత సమయం పట్టనుండడం, చా లా స్థానాల్లో గెలుపు మార్జిన్లు 1000 ఓట్లకన్నా తక్కువ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ కొనసాగుతున్న స్థానాలు ఫలితాలు ఎటు మారుతాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎన్‌డిఎ 54 చోట్ల విజయం సాధించి మరో 68 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మరో వైపు ఆర్‌జెడికాంగ్రెస్ నే తృత్వంలోని మహా ఘట్‌బంధన్ 44 స్థానాల్లో విజ యం సాధించగా మరో 71 స్థానాల్లో అధిక్యతలో ఉంది. ఇతరులు రెండు చోట్ల గెలుసొంది 5 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు.ఈ ఎన్నికల్లో ఎల్‌జెపి ఎలా ంటి ప్రభావం చూపకపోగా కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది.

ఎన్‌డిఎ కూటమిలో బిజెపి 73 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా, జెడియు కేవ లం 45 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. కాగా ఆర్‌జెడి 74 స్థానా ల్లో ముందంజలో ఉండి అతి పెద్ద పార్టీగా అవతరించేందుకు అడుగు దూరంలో ఉంది. మహాఘట్‌బంధన్‌లోని భాగస్వామ్య పక్షా ల్లో కాంగ్రెస్ 20 స్థానాల్లో ముందంజలో ఉండగా వామపక్షాలు మరో 17 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి చేరువవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో బిజెపి అగ్రనేత అమిత్ షా జెడి (యు) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, మంత్రివర్ంగ కూర్పు లాంటి అంశాలపై వారు చర్చలు జరిపి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఎన్‌డిఎ కూటమి మెజారిటీ సాధిస్తున్నా జెడి(యు) మూడో స్థానానికి నెట్టివేయడంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒక వేళ నితీశ్ తిరిగి ముఖ్యమంత్రి అయినా కీలక శాఖలను బిజెపి డిమాండ్ చేయవచ్చని అంటున్నారు. మరో వైపు బీహార్ బిజెపి నేతలు సుశీల్ కుమార్ మోడీ, ఉపేంద్రయాదవ్ తదితరులు నితీశ్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటినుంచి కూడా ఎన్‌డిఎ, ఆర్‌జెడి కూటమి మధ్య నువ్వానేనా అన్న విధంగా పోటీ కొనసాగింది. ఒక దశలో ఆర్‌జెడి కూటమి ఆధిక్యతలోకి దూసుకు పోవడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా అని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత ఎన్‌డిఎ పుంజుకుంది. మరో వైపు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ ఓట్ల లెక్కింపు జరుగు తుండడంతో ఫలితాల వెల్లడి జాప్యం కావడం కూడా ఇరు కూటముల్లోని నేతల్లో ఉత్కంఠకు కారణమైంది. మంగళవారం అర్ధరాత్రికి కానీ కౌంటింగ్ పూర్తి కాకపోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో అప్పటికి కాని ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన రూపం తెలిసే అవకాశం కనిపించడం లేదు. ఒక దశలో బిజెపి కార్యకర్తలు అటు పాట్నాలో, ఇటు ఢిల్లీలో విజయోత్సవాలకు కూడా సిద్ధమయ్యారు.

అయితే ఆతర్వాత ఆర్‌జెడి కూటమి ఎన్‌డిఏకు మధ్య తేడా తగ్గిపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అయితే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమా ఆ కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది. మరో వైపు ఆర్‌జెడి నేత తేజశ్వి యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై తీవ్రఆరోపణలు చేశారు. తాము 119 స్థానాల్లో విజయం సాధించామని, అయితే నితీశ్ , ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీలు ఫలితాలు ప్రకటించడం ఆలస్యం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారని ఆరోపించారు. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గెలుపొందిన ప్రముఖులు

కాగా గెలుపొందిన ప్రముఖుల్లో ఆర్‌జెడి నేత తేజశ్వి యాదవ్ రాఘోపూర్‌లో, అతని సోదరుడు తేజ్ ప్రతాప్ హసన్‌పూర్ నియోజక వర్గంనుంచి విజయం సాధించారు. మరో వైపు ఎన్‌డిఎ కూటమి భాగస్వామ్య పార్టీ హిందుస్థాన్ అవామ్ మోర్చా నేత , రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝి ఇమాంగంజ్ నియోజక వర్గంనుంచి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 16 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా బాంకీపూర్‌లో శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా,, బిహారీ గంజ్‌లో శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి వెనుకంజలో ఉన్నారు. గెలుపొందిన చాలా మంది అభ్యర్థులు వందల ఓట్ల తేడాతో విజయం సాధించడాన్ని బట్టి రెండు కూటముల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జెడి(యు)ను తీవ్రంగా దెబ్బ కొట్టిన ఎల్‌జెపి

నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జెడి(యు) బీహార్‌లో మూడో స్థానానికి పడిపోవడానికి చిరాగ్‌పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జెపియే కారణమని ఫలితాల సరళిని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతోంది. బిజెపితో తనకు విభేదాలు లేవంటూనే ఎన్‌డిఎ నుంచి విడిపోయి విడిగా పోటీ చేసిన చిరాగ్ ఎల్‌జెపి వల్ల ఈ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయింది జెడి(యు)నేనని అందరూ ఏకీభవిస్తున్నారు. తన పార్టీ అభ్యర్థులను జెడి(యు) పోటీ చేసిన ప్రతి చోటా నిలిపిన చిరాగ్, బిజెపి స్థానాల్ని మాత్రం వదిలేశారు. దీంతో తమ పార్టీ ఓట్లతోపాటు బిజెపి ఓట్లు కూడా తమ అభ్యర్థులకు పడేలా ఎల్‌జెపి వ్యూహం పన్నింది. అయితే, ఈ వ్యూహం వెనుక బిజెపిలోని కొందరు నేతల హస్తం ఉన్నదా అన్న అనుమానాలు సహజంగా కలిగేవే. ఈ నేపథ్యంలో నితీశ్‌ను ఎన్‌డిఎలో జూనియర్ భాగస్వామి స్థానానికి దిగజార్చడానికి చిరాగ్‌ను బిజెపి ఓ పావుగా వాడుకున్నదని జెడి(యు) మాజీ నేత పవన్‌వర్మ అన్నారు.

పది నెలల క్రితం జెడి(యు) నుంచి బహిష్రుృతుడు కావడానికి ముందు పవన్‌వర్మ నితీశ్‌కు సన్నిహితుడు. పవన్‌వర్మ వాదనను పలువురు రాజకీయ పరిశీలకులు సమర్థిస్తున్నారు. ప్రధాని మోడీని అభిమానించే బిజెపి కార్యకర్తల్లో నితీశ్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ప్రధాని మోడీ గుజరాత్ సిఎంగా ఉన్న సమయంలో 2010లో పాట్నాలో జరగాల్సిన ఓ డిన్నర్ పార్టీని నితీశ్ రద్దు చేశారు. ఆ పార్టీకి మోడీ హాజరు కావడం తనకు ఇష్టం లేదని తెలిపేందుకే నితీశ్ అలా వ్యవహరించారు. అంతేకాదు, 2014లో బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడీని ఆ పార్టీ ఎన్నిక చేయగా, అందుకు నిరసన తెలుపుతూ ఎన్‌డిఎ నుంచి నితీశ్ బయటకొచ్చారు. తనను లౌకికవాదిగా చెప్పుకునే నితీశ్ తిరిగి ఎన్‌డిఎలో చేరే వరకూ మోడీని వ్యతిరేకిస్తూ వచ్చారన్నది గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News