Monday, May 6, 2024

రేపటి నుండి నూతన పోలీస్ స్టేషన్‌లో సేవలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ములుగు క్రైం : జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 12 నుండి సేవలు ప్రాంరభం కానున్నాయని ములుగు డిఎస్పీ రవిందర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రవిందర్ మాట్లాడుతూ ఈనెల 7న రాష్ట్ర ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి తారక రామారావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్‌లతో కలిసి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారని, ఈనెల 12 (సోమవారం) నుండి నూతన పోలీస్ స్టేషన్‌లో ప్రజల సౌకర్యార్ధం సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు.

గతంలో బస్టాండ్‌కు ఎదరుగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ కార్యాలయం ఉంటుందని ప్రజలు గమనించాలని, ఇకపై ఫిర్యాదులు చేయదల్చుకున్న ప్రజలు నూతన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు అందించాలని అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకు బస్టాండ్ నుండి గట్టమ్మ వరకు జాతీయ రహదారిపై 3కె రన్ కార్యక్రమం ఉంటుందని, ఉత్సాహవంతులు పాల్గొని 3కె రన్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు సిఐ మేకల రంజిత్ కుమార్, ములు గు ఎస్సై కె పవన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News