Saturday, April 27, 2024

కొత్త వారికే పెద్దపీట

- Advertisement -
- Advertisement -

గెలుపు గుర్రాలకే లోక్ సభ అభ్యర్థిత్వం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్ష న్ కమిటీ సమావేశంలో 9 మంది అ భ్యర్థుల పేర్లు కొలిక్కి వచ్చినట్టుగా తెలిసిం ది. అయితే ఇందులో కొత్తగా పార్టీలో చే రినవారితో పాటుగతంలో కాంగ్రెస్ నుం చి వేరే పార్టీకి వెళ్లి మళ్లీ ప్రస్తుతం కాం గ్రెస్ పార్టీలో చేరిన వారికి టికెట్ లభించినట్టుగా తెలిసింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్‌లు ఇవ్వొద్దని పార్టీ కేడర్ సూచించినా సర్వేలు వారికి అనుకూలం గా రావడంతో ఏఐసిసి నాయకులు సై తం వీరికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఢిల్లీలో జరిగిన సీఈసీ ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అగ్రనేతలు సో నియా గాంధీ, కెసి వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు. సెంట్రల్ ఎలక్ష న్ కమిటీ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగడ్, సిక్కిం , వెస్ట్ బెంగాల్, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థులపై కసరత్తు చేసినట్టుగా తెలిసింది. ఇక తెలంగాణ నుంచి టిపిసిసి ప్రెసిడెంట్, సిఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటి వరకు రెండు జాబితా ల్లో 82 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో 4 ఎంపి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. 13 పార్లమెంట్ స్థానాలపై మంగళవారం జరిగిన సమావేశంలో చర్చించడంతో పాటు అభ్యర్థుల పేర్లపై సీఈసీ సభ్యులు ఏకాభిప్రాయయానికి వచ్చినట్టుగా తెలిపింది. ఈ అభ్యర్థుల జాబితాను నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు
గెలుపే ప్రధానం అన్న లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను ఏఐసిసి పరిగణనలోకి తీసుకుంటుం ది. ఓ వైపు సామాజిక సమతుల్యత పాటిస్తూనే మరోవైపు విజయం సాధించే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దిశగా కాంగ్రెస్ నాయకత్వం ముందు కు వెళుతుంది. ముఖ్యంగా జనాదరణ ఉన్న నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. మొదటి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గాలకు ఏఐసిసి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, సర్వేలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏఐసిసి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సీట్ల విషయమై కూడా ఇందులో చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఈ సమావేశంలో భాగంగా మరోసారి ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టినట్టుగా తెలిసింది. భువనగిరి నుంచి బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె డ్డి సతీమణి లక్ష్మి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కం చర్ల చంద్రశేఖర్‌రెడ్డిలు పోటీ పడుతుండగా, ఆదిలాబాద్ నుంచి డా.సుమలత, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ లు, ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డిలు, తుమ్మల కుటుంబ సభ్యు లు పోటీ పడుతుండగా, పెద్దపల్లి నుంచి వివేక్ కు మారుడు వంశీ, గజ్జెల కాంతం, మాజీ ఎంపి సు గుణ కుమారిలు పోటీ పడుతున్నారు.
9 సీట్లపై ఏకాభిప్రాయం
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలిసింది. రెండు రోజుల్లో జాబితా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏకాభిప్రాయానికి వచ్చిన 9 సీట్లలో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, మల్కాజిగిరి నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, హైదరాబాద్ నుంచి షానవాజ్, కరీంనగర్ ప్రవీణ్‌రెడ్డి, నిజామాబాద్ టి.జీవన్‌రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవిలను అభ్యర్థులుగా ఫైనల్ చేసినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News