Sunday, May 12, 2024

రుమేనియా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -
nine killed in Romanian hospital fire
9 మంది కొవిడ్ రోగులు మృతి

బుఖారెస్ట్: రుమేనియా రేవు పట్టణం కాన్‌స్టాంటానాలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం తొమ్మిది మంది కొవిడ్ రోగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా కూడా కొవిడ్‌తో బాధపడుతూ కాన్‌స్టాంటానా ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్న వారేనని నగర ఎమర్జెన్సీ ఇన్‌స్పెక్టరేట్ చీఫ్ కాన్‌స్టాంటిన్ అమర్డా చెప్పారు. ఆస్పత్రిలో 113 మంది రోగులున్నారని, ప్రాణాలతో బైటపడిన వారినందరినీ వేరే చోటికి మారుస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి మంటలను అదుపు చేశారని, అయితే ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదనిఆ శాఖ తెలిపింది. కాగా రుమేనియా ఆరోగ్య శాఖలో మౌలిక సదుపాయాల లోటును ఈ ప్రమాదం ఎత్తి చూపిస్తోందని రుమేనియా అధ్యక్షుడు క్లాస్ లోహన్నిస్ ఒక ప్రకటనలో అంటూ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొవిడ్ కారణంగా రుమేనియాలోని ఆస్పత్రులన్నీ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తాజాగా దేశంలో కరోనా వెలుగు చూసినప్పటినుంచీ ఎన్నడూ లేనంత స్థాయిలో 12 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News