Monday, April 29, 2024

రాహుల్ గాంధీ మాట్లాడాల్సిన మాటలేనా..?: నిరంజన్ రెడ్డి ఫైర్

- Advertisement -
- Advertisement -

దేశంలో, ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 11 విడతలలో రూ.72 వేల 815 కోట్లు జమచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలోమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భీమా పథకం ద్వారా ఇప్పటివరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్ల భీమా పరిహారం అందేలా చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.

రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి తెలంగాణ తరహా పథకాలు లేవు అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ. లక్షా 33 వేల కోట్లతో, 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించి, 8.93టిఎంసిల సామర్థ్యంతో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేపట్టామని తెలిపారు. దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ రాష్ట్రంలోని రైతులందరికి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు.

ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి రైతులకు బిక్షంలా కనిపిస్తున్నాయా? అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ.. నియోజకవర్గానికి ఒక సభ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ది రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?.. ఒక జాతీయ పార్టీ నేతగా రాహుల్ మాట్లాడాల్సిన మాటలేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News