Saturday, April 27, 2024

చైనాలో తయారు చేసి భారత్‌లో అమ్ముతామంటే కుదరదు

- Advertisement -
- Advertisement -

Nitin gadkari clarifies on Tesla cars

ఎలాన్ మస్క్‌కు స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ: టెస్లా కార్లు, ఎలాన్ మస్క్ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలుకొట్టారు. భారత్‌లో తయారీ యూనిట్ పెడితే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తామని మరోసారి స్పష్టం చేశారు. అలా కాకుండా చైనాలో కార్లు తయారు చేస్తాం..వాటిని భారత్‌లో అమ్ముతామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఆ ప్రతిపాదనే తమకు మింగుడు పడడం లేదని ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన గడ్కరీ స్పష్టం చేశారు. ‘ భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. బిఎండబ్లు, వోల్వో, ఫోక్స్‌వ్యాగన్, హ్యుండాయ్, హోండా, రేనాల్ట్ వంటి ఎన్నో కంపెనీలు ఇక్కడ తయారీ యూనిట్లను నెలకొల్పాయి.ఇప్పుడు కొత్తగా టెస్లాకు మేము రాయితీలు ఇస్తే.. పాత కంపెనీలకు అన్యాయం చేసినట్లువుతుంది.అయినా చైనాలో ప్లాంట్ పెడతాం.. అక్కడి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇండియాలో కార్లు అమ్ముకొని లాభాలు పొందుతాం అనే ధోరణి మాకు మింగుడు పడడం లేదు’ అని గడ్కరీ స్పష్టం చేశారు.

టెస్లా కార్లను బారత్‌లో అమ్మే ఉద్దేశంతో గతంలో బెంగళూరులో టెస్లా కంపెనీ ఆఫీస్‌ను రిజిస్టర్ చేసింది. అయితే ఎలక్ట్రిక్ వాహనం అయినందున పన్ను రాయితీలు ఇవ్వాలని మెలిక పెట్టింది.అయితే దేశంలో తయారీ యూనిట్ పెడితేనే రాయితీలు ఇస్తామని, లేదంటే భారీ పన్నులు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అటు భారత మార్కెట్‌ను వదులుకోలేక, ఇటు ప్లాంట్ పెడతానంటూ హామీ ఇవ్వలేక ఎలాన్ మస్క్ ‘ ప్రభుత్వం సహకరించడం లేదు’ అని అంటూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News