Saturday, April 27, 2024

తన పెళ్లికి కెసిఆర్ ను ఆహ్వానించిన నితిన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నితిన్ జులై 26న షాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా పెళ్లి పత్రిక ఇచ్చేందుకు నితిన్ ప్రగతి భవన్ కు వెళ్లాడు.  తన వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వాదించాలని కోరుతూ సిఎం కెసిఆర్ కు వివాహ పత్రికను నితిన్ అందజేశారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.   ఈ ప్రేమ జంట దుబాయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కానీ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లోనే వివాహం చేసుకుంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వ నియమాలు పాటిస్తూ వివాహ వేడుకను జరుపనున్నారు. వివాహ వేడుకు హాజరైన  బంధువులు, స్నేహితులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News