Wednesday, May 1, 2024

నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్….

- Advertisement -
- Advertisement -

Corona vaccine trials at nims

 

హైదరాబాద్: కరోనా వైరస్ భారత్‌ను కలవరపెడుతోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందడుగు వేయడానికి నిమ్స్‌లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్‌లో భాగంగా ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. భారత్ బయోటెట్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి కరోనా వ్యాక్సిన్ తయారు చేశాయి. దేశ వ్యాప్తంగా 12 వైద్యకేంద్రాల్లో క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాను అంతం చేయడానికి భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు డిసిజిఐ అనుమతి ఇచ్చింది. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించేందుకు ప్రపంచదేశాలు నడుంబిగించాయి. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను సిద్దం చేయాలని ఐసిఎంఆర్ ప్రయత్నిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News