Sunday, April 28, 2024

‘ఇండియా ’ కూటమి కథ ఎప్పుడో ముగిసింది : నితీశ్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

పాట్నా : ఇండియా కూటమిలో పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైందని, ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నానని, దీనినే కొనసాగిస్తానని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఇండియా కూటమి లోని కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్ సిఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమిపై విమర్శలు సంధించారు. ఈ సందర్భంగా శనివారం విలేఖరులతో మాట్లాడారు.

కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. “అసలు కూటమికి ఇండియా అనే పేరుపెట్టడం నాకు ముందునుంచే ఇష్టం లేదు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాను.” అని పేర్కొన్నారు. నితీశ్ కోసం ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. “ఎవరు ఏం మాట్లాడుతున్నా . దాని గురించి ఆలోచించవద్దు . పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లే వారి (ఆర్జేడీని ఉద్దేశిస్తూ) నుంచి విడిపోయా” అని నితీశ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News