Monday, April 29, 2024

నేడే ఎంఎల్‌సి ఉపపోరు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు సర్వం సిద్ధం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్
ఓటేయనున్న 824 మంది బరిలో కవిత(టిఆర్‌ఎస్), సుభాష్‌రెడ్డి(కాంగ్రెస్), లక్ష్మీనారాయణ(బిజెపి)

Nizamabad MLC By-Election on Oct 9

మన తెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉపఎన్నిక శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. అవసరమైన సిబ్బంది, పోలింగ్ సామాగ్రి కేంద్రాలకు తరలినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్ని కల్లో టిఆర్‌ఎస్ తరపున మాజీ ఎంపి కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బిజెపి తరపున పి. లక్ష్మీనా రా యణ పోటీలో ఉన్నారు. కొవిడ్ మార్గదర్శకాలకు అను గుణంగా పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 824మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లుగా ఉన్నవారందరికీ కరోనా టెస్టులు ముందుగానే చేశారు. ఇందులో 24మంది కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. వీరిలో ఒకరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మిగతా వాళ్లు ఓటింగ్ చేసేందుకు చివరి గంట అవకాశం ఇస్తున్నారు.

సొంత వాహనం.. లేదంటే ప్రత్యేకంగా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. పిపిఇ కిట్ ధరించిన తర్వాతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎంఎల్‌సి ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ప్రాధాన్య అంకె రూపంలో ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్, అభ్యర్థి పేరు, చిత్రం, పార్టీ పేరు ఉంటుంది. పార్టీ గుర్తు బ్యాలెట్‌పై ఉండదు. ఓటరు వేలుకు ఎలాంటి సిరా చుక్క వేయరు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఓటింగ్ పూర్తయినా.. పోలింగ్ సయమం ముగిసే వరకు పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోనే ఉంటారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తల నడుమ ఎన్నిక జరగనుంది. మండలానికి ఒకటి చొప్పున మొత్తం 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎక్స్‌అఫిషియో సభ్యులు
ఎంఎల్‌సి ఉపఎన్నికలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఓటు హక్కును వినియోగించుకోను న్నారు. ఎంఎల్‌ఎలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, షకీల్, గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాసరెడ్డి, సురేందర్‌తో పాటు ఎంఎల్‌సిలు వి.జి గౌడ్, ఆకుల లలిత, రాజేశ్వర్ ఓటు వేయనున్నారు. బిజెపి ఎంపి అర్వింద్ సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, సురేశ్‌రెడ్డి, జిహెచ్‌ఎంసిలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండటంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి పోటీదారులకు ఓటేసే అవకాశం లేదు.

Nizamabad MLC By-Election on Oct 9

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News