Sunday, April 28, 2024

అమెరికాలో నల్గొండ వాసి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

NRI Devender Reddy killed in America

హైదరాబాద్‌ః అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్‌లో నల్గొండ జిల్లా వాసి దేవేందర్‌రెడ్డి కారులో మంటలు చెలరేగి అనుమానస్పద రీతిలో మంగళవారం నాడు సజీవదహనమయ్యారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లికి చెందిన దేవేందర్‌రెడ్డి మెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యుడిగా ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ దేవేందర్‌రెడ్డి మృతితో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. అతని కుటుంబసభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. దేవేందర్‌రెడ్డి 22 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారని మృతుని బంధువులు పేర్కొన్నారు. మృతుడికి 7 సంవత్సరాల కూతురు ఉందని వెల్లడించారు. న్యూజెర్సీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు.

ఎన్‌ఆర్‌ఐ దేవేందర్ రెడ్డి ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు ఎటువంటి వివరాలను విడుదల చేయకపోవడంతో అనుమానస్పదంగా మారింది. కాగా కారులో దేవేందర్ రెడ్డి ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని న్యూజెర్సీ పోలీసులు పేర్కొంటున్నట్లు తెలియవచ్చింది. కాగా మృతుడు దేవేందర్ రెడ్డి అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారిక ప్రతినిధిగా పలు సేవా కార్యాక్రమాలు చేపట్టాడని, యుఎస్‌లో భారతీయుల సమస్యలపై వెంటనే స్పందించేవాడని అమెరికాలోని అతని స్నేహితులు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ ఏర్పాటులో కూడా ఆయన చాలా చురుకుగా పనిచేసేవాడని వివరించారు. అమెరికాలోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ వాట్సాప్ గ్రూపులలో దేవేందర్‌రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యూజెర్సి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News