Monday, April 29, 2024

ఉపరితల గనులను సందర్శించిన డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జేవిఆర్‌ఓసి, కిష్టారం ఓసి ఉపరితల గనులను బుధవారం డిఎంఎస్ (మైనింగ్) (సౌత్ జోన్, రీజియన్-1) హైదరాబాద్ ఉమేష్ మధుకర్ రావు సావర్కర్, డిడిఎంఎస్(మైనింగ్) హైదరాబాద్ రీజియన్ 1 కమలేష్ కుమార్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు. ముందుగా జేవిఆర్‌ఓసి, కిష్టారం ఓసి ఉపరితల గనుల నందు వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఓబి తొలగింపు, బొగ్గు రవాణాను పరిశీలించారు.

రక్షణపై తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పని ప్రదేశంలో రక్షణతో కూడిన ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ పూర్తి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని సూచించారు. కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సేఫ్టీ విభాగంపై ఉందని, అధికారులు ఎప్పటికప్పుడు పని ప్రదేశాలను పరిశీలిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం జేవిఆర్‌ఓసి, కిస్టారమ్ ఓసి నందు పని చేసే 150 మంది కాంట్రాక్ట్ కార్మికులతో రక్షణపై అవగాహన పెంచుట కొరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎస్ (మైనింగ్) (సౌత్ జోన్, రీజియన్-1) హైదరాబాద్ ఉమేష్ మధుకర్ రావు సావర్కర్, డిడిఎంఎస్(మైనింగ్) హైదరాబాద్ రీజియన్-1 కమలేష్ కుమార్ వర్మ, కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేష్, జిఎం సేఫ్టీ గురువయ్య, కొత్తగూడెం రీజియన్ సేఫ్టీ జిఎం కుమార స్వామి, ఎస్‌ఓటు జిఎం జివి.కోటి రెడ్డి, జేవిఆర్‌ఓసి పిఓ వెంకటా చారి, కిష్టారం ఓసి పిఓ నరసింహా రావు, మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News