Saturday, April 27, 2024

పాతబస్తీలో మెట్రో పనులు త్వరలో ప్రారంభం: ఒవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రలైలు నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని హైదరాబాద్ ఎంపి, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. శనివారం రెయిన్ బజార్ మున్సిపల్ డివిజన్‌లో రూ. 8.69 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.

ప్రతిపాదిత మెట్రో రైలు లైన్ వల్ల దెబ్బతినే ఆస్తులను గుర్తించడం జరుగుతోందని, సర్వే పనులు సంబంధిత మెట్రో రైలు అధికారులు పూర్తి చేశారని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

త్వరలో గుల్జార్ హౌస్‌ను ప్రారంభించనున్నట్లు ఒవైసీ తెలిపారు. రాష్ట్ర మంత్రి కెటి రామారావు చేత దీన్ని ప్రారంభించాలన్నది తన కోరికని ఆయన తెలిపారు.

ఏకరూపతను తీసుకురావడంతోపాటు చారిత్రక వైభవాన్ని కల్పించేందుకు లాడ్ బజార్ వద్ద భారీ ప్రాజెక్టును చేపట్టాలని అధికారులు ఆలోచిస్తున్నారని ఒవైసీ చెప్పారు. త్వరలోనే ప్రకటించనున్న ఈ ప్రాజెక్టు కోసం రూ. 50 కోట్లు కేటాయించున్నట్లు ఆయన వెల్లడించారు.

రూ. 30 కోట్ల వ్యయంతో చార్మినార్ బస్ స్టాండ్ వద్ద బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News