Monday, April 29, 2024

వనమా వెంకటేశ్వర్‌రావుకు హైకోర్టు మరోసారి షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికల చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు గురువారం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ మూడు రోజుల కితం తీర్పు ఇచ్చింది.

2018 ఎన్నికల్లో అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని హైకోర్టును సమీప అభ్యర్ధి జలగం వెంకటరావు ఆశ్రయించడంతో వాదోప వాదనలు విన్న తర్వాత వనమా అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది. దీంతో హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈమేరకు అత్యవసర పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్దానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈతీర్పును నిలిపివేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేయడంతో మరోసారి వనమాకు చేదు అనుభవం ఎదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News