Monday, April 29, 2024

వీలైతే యుపిలో కూటమితో బరిలోకి

- Advertisement -
- Advertisement -
Open-minded on forging alliance with other parties
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూటమి ఏర్పాటుపై కాంగ్రెస్ దాపరికం లేకుండానే వ్యవహరిస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. ఆదివారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది యుపి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 403 అసెంబ్లీ స్థానాల రాష్ట్రంలో పార్టీ ఒంటరిగానే రంగంలోకి దిగుతుందా? అనే ప్రశ్నకు ప్రియాంక స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే వివరణకు దిగలేమని, ఆంకా తగు సమయం ఉందని తేల్చివేశారు. భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేసే వీలుందా? అని విలేకరులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం దాటవేసిన ప్రియాంక ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటును తోసిపుచ్చడం లేదన్నారు. ఈ విషయంపై చిత్తశుద్ధితో ఉన్నామని అన్నారు. యుపిలో కాంగ్రెస్ పరిస్థితి గురించి కూడా ఆమె తెలిపారు. ప్రియాంక రాష్ట్రానికి వచ్చినప్పుడే పార్టీలో హడావిడి ఉంటుందని, లేకపోతే అంతా నిద్రాణంగా ఉంటుందనే అంశాన్ని ప్రస్తావించారు.

తాను ఇక్కడికి వచ్చినప్పుడు సహజంగానే మీడియా పార్టీపై దృష్టి సారిస్తుందని, తరువాత మీడియానే ఇటువైపు రావడం మానివేస్తుందని, ఇది మీడియా వారి ధోరణి అని తెలిపారు. అయితే తాను ఇక్కడకు వచ్చినా రాకపోయినా పార్టీలో యధావిధగా కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు. కోవిడ్ 19 తీవ్రస్థాయి దశలో తమ పార్టీ ప్రజలకు చేదోడువాదోడుగా ఉందని,పలు కీలక అంశాలను తాము ప్రస్తావించామని చెప్పారు. తమ పార్టీ అధికారంలో లేక 30, 32 సంవత్సరాలుగా ఉంది. బలహీనం అయిందని, అయితే పార్టీ పునరుజ్జీవానికి పూర్తి శక్తియుక్తులు వాడినట్లు, దీనితో నూతనోత్తేజం వచ్చినట్లు ప్రియాంక విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపై తాను యుపిలో పార్టీ బలోపేతానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. తాను ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిఎం అభ్యర్థిగా తెరపైకి వస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ దీనిపై చెప్పడానికి ఇంకా సమయం ఉందన్నారు. లక్నోలో మూడు రోజుల పర్యటనకు ప్రియాంక వచ్చారు. కాంగ్రెస్ సేవాదళ్ బలోపేతానికి రంగం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. యుపిలో ప్రియాంక రాజకీయ యాత్రికురాలు అనే బిజెపి వాదనను ప్రియాంక తోసిపుచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలతో తనను సోదరుడు రాహుల్‌ను వచ్చిపోయే నేతలని చిత్రీకరించేందుకు బిజెపి యత్నిస్తోందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News