Thursday, May 9, 2024

ఏడాదికి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్‌ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

Deposits

ముంబై: అక్రమ నగదు లావాదేవీలకు అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.  ఏడాదికి 20 లక్షలకుమంచి నగదు డిపాజిట్‌ చేస్తే పాన్‌, ఆధార్‌ తప్పనిసరిగా నమోదు చేయాలి.  2022, మే 10 నాటి నోటిఫికేషన్‌లో  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటా) రూపొందించిన కొత్త నియమాలు, నిబంధనల సవరించింది. ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి.

ఆర్థికం స్కాంలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం  వార్షిక నగదు పరిమితి నిబంధనలను సవరించింది. ఇప్పటికి వరకు రోజుకు రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను  అందించే నిబంధన ఉంది.  ఇకపై ఏడాదికి 20 లక్షలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్‌ నెంబరు, ఆధార్‌ వివరాలు  తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ పాన్ నంబర్ లేకుంటే. ఆ లావాదేవీ చేయడానికి వారం ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రశీదును బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. సన్నిహిత కుటుంబ సభ్యుల నుంచి తప్ప రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదును స్వీకరించడం కూడా నిషేధం.  నిబంధనలకు విరుద్థంగా పరిమితికి మించి నగదు చెల్లించినా,  స్వీకరించినా లావాదేవీ మొత్తంలో 100 శాతం వరకు జరిమానా  విధించే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News