Friday, May 3, 2024

పారాలింపిక్స్‌కు తెరలేచింది..

- Advertisement -
- Advertisement -

Paralympic Games Opening Ceremony

కనుల పండవగా ఆరంభోత్సవ వేడుకలు

టోక్యో: మరో విశ్వ క్రీడా సంగ్రామానికి జపాన్ రాజధాని టోక్యో నగరం సిద్ధమైంది. ఇటీవలే విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌ను దిగ్విజయంగా నిర్వహించిన టోక్యో తాజాగా పారాలింపిక్స్‌కు వేదికగా నిలిచింది. 163 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్న దివ్యాంగుల క్రీడా సంగ్రామం పారాలింపిక్స్‌కు మంగళవారం తెరలేచింది. టోక్యోలోని ప్రధాన స్టేడియంలో క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం కనుల పండవగా జరిగింది. ఈ క్రీడల్లో దాదాపు 163 దేశాల నుంచి దాదాపు 4500 మందికి పైగా అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు. భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగనున్నారు. ఇంత భారీ సంఖ్యలో అథ్లెట్లతో భారత్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగడం ఇదే తొలిసారి.

కిందటిసారి కంటే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భారత్ తహతహలాడుతోంది. కనీసం 15 పతకాలు సాధించాలనే పట్టుదలతో భారత అథ్లెట్టు ఒలింపిక్స్‌ఉ సిద్ధమయ్యారు. ఇక ఆరంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను కనువిందు చేశాయి. ఇక ఫైర్‌వర్క్‌తో పాటు జపాన్ కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక క్రీడల్లో పాల్గొన్న ఆయా దేశాలకు చెందిన క్రీడాకారులు మార్చ్‌పాస్ట్‌లో పాలుపంచుకున్నారు. భారత బృందానికి టెక్‌చంద్ పతాకధారిగా వ్యవహించాడు. రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు క్వారంటైన్‌లోకి వెళ్లడంతో అతని స్థానలో టెక్‌చంద్ పతాకధారిగా వ్యవహరించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News