Monday, May 6, 2024

ఎసిబి వలలో పేఅండ్ అకౌంట్స్ అధికారి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పేఅండ్ అకౌంట్స్ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తోట రామారావు రూ. 5వేలు లంచం తీసుకుంటూ శనివారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. లంచం కేసులో అకౌంట్స్ అధికారి రామారావుతో పాటు గోపినాథ్ అనే ఆడిటర్‌ను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ల్యాండ్స్ అండ్ సర్వే శాఖలో డిప్యూటీ ఇన్సెక్టర్‌గా పనిచేస్తున్న కొన్నుగంటి క్రిష్ణ తనకు రావాల్సిన రూ.1,78,737 పెండింగ్ వేతనాల కోసం పేఅండ్ అకౌంట్స్ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తోట రామారావును సంప్రదించాడు. దీంతో ఈక్రమంలో ఆడిటర్ గోపినాథ్, అకౌంట్స్ అధికారి రామారావులు రూ. 5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కొన్నుగంటి క్రిష్ణ నేరుగా ఎసిబి అధికారులను కలిస తనకు జరిగిన అన్యాయంతో పాటు లంచం డిమాండ్ చేసిన వారి వివరాలతో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఎసిబి అధికారులు రూ. 5వేలు లంచం తీసుకుంటున్న పేఅండ్ అకౌంట్స్ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తోట రామారావు పట్టుకుని అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ కేసులో రెండవ నిందితుడు ఆడిటర్ గోపినాథ్ పరారీలో ఉన్నట్లు ఎసిబి అధికారులు వివరించారు. అనతికాలంలో ఆడిటర్ గోపినాథ్‌ను అరెస్ట్ చేస్తామని ఎసిబి ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు.

Pay and Accounts Officer trapped in ACB Net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News