Tuesday, September 17, 2024

‘పెళ్లిసందD’ కోసం చిరంజీవి, వెంకటేష్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘పెళ్లిసందD’. దర్వకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు పర్యావేక్షనలో గౌరి రోణంకి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా ఈ నెల 15 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్ జోరు పెంచారు. ఇందులో భాగంగా రేపు(అక్టోబ‌ర్ 10, ఆదివారం) సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ లను మూవీ మేకర్స్ చీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వాంచారు.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ మూవీతోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటుడిగా తెరగేట్రం చేస్తున్నాడు. తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, హేమ, ఝాన్సీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

‘Pelli SandaD’ Pre Release Event on Oct 10th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News