Saturday, April 27, 2024

కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే ఢిల్లీలోకి అనుమతి?

- Advertisement -
- Advertisement -

Permission to enter Delhi if Corona negative report?

 

ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానికి వచ్చే ఐదు రాష్ట్రాలకు చెందిన సందర్శకులను కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు చూపాలని కోరాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు బుధవారం నాడిక్కడ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడో రేపో వెలువడే అవకాశం ఉందని, ఈ ఉత్తర్వులు మార్చి 15 వరకు అమలులో ఉంటాయని వారు చెప్పారు.

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైళ్లు, విమానాలు, బస్సులలో ప్రయాణించే ప్రజలు ఢిల్లీలోకి ప్రవేశించే ముందుగానే తమ కొవిడ్-19 నెగటివ్ రిపోర్టును అధికారులకు చూపాల్సి ఉంటుందని వారు తెలిపారు. వచ్చే శుక్రవారం రాత్రి నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రావచ్చని వారు చెప్పారు. ఈ అంశాన్ని సోమవారం ఢిల్లీ విపత్తు నిర్వహణా సంస్థ(డిడిఎంఎ) సమావేశంలో చర్చించినట్లు అధికారులు వివరించారు. ఈ ఐదు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో రోజువారీ కరోనా కేసులు గణనీయ స్థాయిలో పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీలో 145 తాజా కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కారణంగా ఇద్దరు మరణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News