Sunday, April 28, 2024

పెట్రోల్ ధర 25 పైసలు.. డీజిల్ ధర 30 పైసలు పెంపు

- Advertisement -
- Advertisement -
petrol diesel prices hiked again
తెలంగాణ, ఎపిసహా పలు రాష్ట్రాల్లో 100 మార్క్ దాటిన డీజిల్ ధర

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర 30 పైసలు పెంచాయి. దీంతో, లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.101.89కి, ముంబయిలో రూ.107.95కి చేరింది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.90.17కు, ముంబయిలో రూ.97.84కు చేరింది. పెట్రోల్ ధర వారంలో మూడోసారి పెరగగా, డీజిల్ ధర 8 రోజుల్లో ఆరోసారి పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధర 155 పైసలు, పెట్రోల్ ధర 75 పైసలు పెరిగింది. డీజిల్ ధర మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రూ.100 మార్క్ దాటింది. దేశంలోనే అత్యధిక ధర ఉండే రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రోల్ ధర రూ.113.73కు, డీజిల్ ధర రూ.103.9 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 78 డాలర్లకు చేరింది. ఆరు వారాలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. 2018 తర్వాత ఇదే అత్యధిక ధర. దేశీయంగా ఈ ఏడాది మే 4 నుంచి జులై 17వరకు పెట్రోల్ ధర లీటర్‌కు రూ.11.44, డీజిల్ ధర రూ.9.14 పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News