Sunday, April 28, 2024

శనిగ్రహ చంద్రునిపై జీవాధార భాస్వరం

- Advertisement -
- Advertisement -

వివిధ జీవ ప్రక్రియలకు కీలకమైన భాస్వరం ఉనికి శని గ్రహ చంద్రుడు ఎన్సెలాడస్‌పై శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎన్సెలాడస్ మంచు ఉపరితలం అడుగున సముద్ర జలాలు ఉన్నాయి. ఎన్సెలాడస్ దక్షిణ ద్రువం వద్ద మంచుతో నిండిన పైభాగం ఉంది. రసాయనికంగా ఉత్తేజితమైన వేడి నీరు రాతి నేల నుండి బయటకు వస్తుంటుంది. ఇదే సూక్ష్మప్రాణికి పోషకంగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త అధ్యయనం నేచర్ జర్నల్‌లో వెలువడింది. ఎన్సెలాడస్ సముద్రం భాస్వరం కలిగి ఉందన్న మొదటి సాక్షాన్ని అధ్యయనం వెలువరించడం విశేషం. తాము గతంలో ఎన్సెలాడస్ సముద్రంలో సేంద్రీయ సమ్మేళనాలను కనుగొన్నాం. అయితే ఇప్పుడు భాస్వరం లవణాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొనగలిగామని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా శనిచంద్రుడు ఎన్సెలాడస్‌పై పరిశోధనలు సాగిస్తున్నారు.

Also Read: గంగా ఘాట్‌లో హిందూయేత‌రుల‌కు నో ఎంట్రీ: హరిద్వార్ పోలీసుల దర్యాప్తు

అయితే నాసా కు చెందిన కేశిని మిషన్ శాటిలైట్ ద్వారా సేకరించిన గడ్డకట్టిన స్ప్రేను విశ్లేషించ గలిగారు. భాస్వరం లవణ మంచు కణాలను కనుగొనగలిగారు. భూమిపై జీవులకు ముఖ్యమైన ఆరు మూలకాలు అవసరం. కార్బన్, హైడ్రొజన్, నైట్రొజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్. ఈ ఆరింటిలో ఐదింటిని ఎన్సెలాడస్ విరజిమ్మిన నమూనాల్లో శాస్త్రవేత్తలు కొన్నేళ్ల క్రితమే గుర్తించ గలిగారు. కానీ వారికి అప్పుడు భాస్వరం (ఫాస్ఫరస్) ఉనికి దొరక లేదు. భాస్వరం అన్నది కీలకమైన పదార్థం. ఫాస్ఫేట్ గ్రూపులకు అంటే ఫాస్ఫరస్ ప్లస్ ఆక్సిజన్ గ్రూపులకు ఇది ఎంతో అవసరం.

డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎ వంటి న్యూక్లియక్ యాసిడ్ చైన్లకు ఇది అనుసంధానంగా పనిచేస్తుంది. క్రోమోజోమ్‌లు తయారై జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేసేవి డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎలే. ఎడెనోసైడ్ ట్రైఫాస్ఫేట్ (ఎటిపి) రూపంలో జీవశక్తిని కణాల్లో భద్రపర్చడానికి ఇది వీలు కల్పిస్తుంది. అయితే ఎన్సెలాడస్ లో జీవితం న్యూక్లియక్ యాసిడ్‌ను లేదా ఎటిపిని ఎంతవరకు వినియోగించుకోడానికి వీలు కల్పిస్తుందో కచ్చితంగా చెప్పలేం అని శాస్త్రవేత్తలు అంచనాగా చెబుతున్నారు. ఏదేమైనా మనకు తెలిసినంతవరకు ఫాస్ఫరస్ ఉనికి అన్నది జీవితానికి ముఖ్యం కాబట్టి ఎన్సెలాడస్ జీవితానికి అనుకూలమైనదిగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News