Monday, April 29, 2024

మూడు ముళ్లకు ముందే మురిపెం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : ఇంట్లో పెళ్లి అంటే ఆ హడావిడి వేరు. ఇరు కుటుంబాలు తమ తమ పనుల్లో ఎంతో బిజీ. వారం రోజుల నుంచి ప్రారంభమ య్యే వేడుకలు ప్రతి ఇంటికి ఒక కళను తీసుకొచ్చేవి. ఇక పెళ్లి కూతురు. పెళ్లి కొ డుకు పెళ్లి రోజు మాత్రమే ఎదుట పడేవారు. పెళ్లి తతంగం ముగిసేది. కాని అది గతం. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిలు,ఆ సంబరాలు వేరు. డబ్బున్న వాళ్లు డిస్టినేషన్ మ్యారేజ్‌లని వారం రోజుల పాటు దూరంగా ప్రాంతాలకు వెళ్లి మరీ ఎంజా య్ చేసి వస్తున్నారు.

కాని డబ్బున్నావాళ్లైన,తమ తాహతుకు తగ్గట్టు ప్రతి నూతన జంట తమ పెళ్లి జీవితాంతం గుర్తిండిపోయేలా చెసుకోవాలన్న కల నేరవేర్చుకుంటున్నారు. అందులో భాగమే ప్రీవెడ్డింగ్ షూట్ అంటే పెళ్లికి ముందు వివిధ రకాల థీమ్స్‌తో కాబోయే జంట చేసుకునే సంబరాలు అన్నమాట. ఇక శ్రావణ మాసం ప్రారంభం అవడంతో పెళ్లిల సీజన్ కూడా ప్రారంభమయ్యింది. ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పనిదొరికే సమయం ఇప్పటికే లాక్‌డౌన్‌వల్ల నష్టపోయిన వారికి ఈ శ్రావణ మాసం ఒకింత ఊరటనిచ్చే అంశమే. ప్రీ వెడ్డింగ్ షూట్‌లు ఎలాగో మనమూ తెలుసుకుందాం.
సినిమాను మించిన సెట్టింగ్‌లు
ఫొటో అంటే ప్రత్యేకం అది ఎలా ఉండాలంటే ఎన్ని సంవత్సరాలు గడిచిన అందరికి గుర్తిండిపోయేలా,ఒక్క ఫొటోతో ఒకరిపై ఒకరి ప్రేమ కనబడాలి అప్పుడే ఫొటోను ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు మరి ఇప్పటి జనరేషన్ కొంత అడ్వాన్స్ కాబట్టి వారి కళలను ఫొటోలో పెట్టడానికి అనేక థీమ్స్‌లో ఫొటో షూట్ చేసుకోవడం గమనార్హం. ఇక నూతన జంట కోరిక మేరకు అనేక రకాలుగా థీమ్స్ సృష్టించి వారితో ఫొటో షూట్ చేయిండడం కోసం అనేక మంది ఫొటోగ్రాఫర్లు తమ ప్రతిభను చూపుతున్నారు.

లక్షల డబ్బులు పెట్టి మరి చిన్నపాటి ఔట్ డోర్ స్టూడియెలు తయారు చేస్తున్నారు. అందులో వివిధ రకాల థీమ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రతి దానికి ఒక ప్రత్యేక ప్యాకేజితోఅందిస్తున్నారు. థీమ్స్‌లో గ్రామీణ ప్రాంతాలు,లగ్జరీగా ఉండే ప్రాంతాలు, కొండలు, గుట్టలు, బీచ్‌లు, స్విమ్మింగ్‌పూల్, చిన్నపాటి బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేయడం ఫొటోగ్రాఫర్లు లోకేషన్‌కి తగ్గట్లు జంటల కాస్యూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.క్రియేటివిటీకి మారు పేరుగా నిలుస్తు ఫొటోగ్రాఫర్‌లు ఉపాధి పొందుతున్నారు.

ప్రత్యేక లొకేషన్స్‌లో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్‌లు..
ఇక ప్రత్యేకంగా తయారు చేసిన స్టూడియోల్లోనే కాకుండా పరిసర ప్రాతాంలో నేచురల్‌గా ఉన్న లొకేషన్స్‌లో కూడా ఫొటోషూట్‌లు చేస్తున్నారు. కాబోయే జంటల కోరికలకు ప్రాధాన్యం ఇస్తూ మంచి లొకేషన్స్‌లో ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్సింగ్‌లతో పాటు డ్రోన్ కెమెరాలతో ఫొటోషూట్‌లు నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న జలపాతాలు, వెళాడే బ్రిడ్జిలు, మినీ ట్యాంకుబండ్‌లు పార్క్‌ల్లో, ఎత్తైన హైక్లాస్ సొసైటీల్లో ఫోటో షూట్‌లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఫొటో షూట్‌ల వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.

సినిమా పాటలతో షూటింగ్‌లు….
ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే కేవలం ఫొటోలే కాదు, వీడియోలు కూడా తీస్తున్నారు. సినిమా పాటలతో హల్‌చల్ చేస్తున్నారు. నూతన జంటలకు ఇష్టమైన పాటలతో డ్యాన్స్‌లు కూడా చేయిస్తూ వీడియోలు చేస్తున్నారు. ప్రత్యేక క్యాస్టూమ్స్,మేకప్, డ్యాన్స్‌లతో అదరకొడుతూ సినిమాను మించిన ఫొటో షూట్‌లు నిర్వహిస్తున్నారు.
ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ హవా నడుస్తుంది.

నర్సింగ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
ప్రస్తుత కాలంలో నూతనంగా పెళ్లి చెసుకోబోయె జంటలు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. తమకు కాబోయే భాగస్వామితో జీవితాంతం గుర్తిండిపోయేలా ఫొటోలు ఉండాలని కోరుకుంటున్నారు. వారి ఆలోచనకు తగ్గట్టుగా ప్రత్యేక థీమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం, ప్రత్యేక కాస్టూమ్స్ ఏర్పాటు,ప్రత్యేకంగా మేకప్ వేయడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నాం, మేముకూడా ప్రత్యేక ఐడియాలు ఇచ్చి వారిని ఫొటో షూట్‌కి సిద్ధం చేస్తున్నాం. పెళ్లిల సీజన్‌లో రోజుకు నాలుగు ప్రీ వెడ్డింగ్ షూట్‌లు నిర్వహిస్తాం, ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందిస్తున్నాం.

క్వాలిటియే ముఖ్యం..
నరేష్, ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
ఎంత మంచి ఫొటోలు తీసినా చివరకు నచ్చాల్సిన వ్యక్తులకు నచ్చితేనే మనకు సంతృప్తి లభిస్తుంది. అందవల్ల పనిలో కానీ, క్వాలిటీలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఫొటో షూట్‌లు నిర్వహిస్తున్నాం. దాని వల్ల చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఇప్పటికి మేమే చాల ఫొటోషూట్‌లు చేశాం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News