Friday, April 26, 2024

మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత నిర్వర్తించాలి

- Advertisement -
- Advertisement -

green challenge

 

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు యువతరం నడుం బిగించాలని గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగస్వాములై మొక్కలు నాటాలని భూపాలపల్లి డిఎస్పీ సంపత్‌రావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని డిఎస్పీ సంపత్ రావు స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిఎస్పి సంపత్‌రావు మాట్లాడారు. హరితహారంకి మద్దతుగా గ్రీన్‌ఛాలెంజ్ ద్వారా ఇప్పటికే నాలుగు కోట్ల మొక్కలు నాటిన ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ పది కోట్లు మొక్కలు నాటేవరకు తమ వంతు సహకార మందిస్తామన్నారు. నాటిన ప్రతి మొక్క ఎదిగేంతవరకు బాధ్యత తీసుకుం టామన్నారు. మరో ముగ్గురికి ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. భూపాలపల్లి ఆర్టీసీ డిఎం లక్ష్మీ ధర్మ, చిట్యాల సిఐ సాయి రమణ, రేగొండ ఇంఛార్జి బాలస్వామి, ఐపిఎస్‌లను గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు.

పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎపిలోని విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎంఎల్‌ఎ అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. 30, 40 సంవత్సరాల తర్వాత ఏర్పడే పర్యావరణ పర్యవసానాలు దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో వాతావరణంలో వచ్చే హెచ్చు తగ్గులను సమతుల్యత కావాలంటే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శుక్రవారం ఆయన రాంపూర్ గ్రామం, సబ్బవరం మండలంలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. మరో ముగ్గురిని నామినేట్ చేశారు. పర్యావరణ పరిరక్షణకి ఎంతో చేస్తున్న ఎంపి సంతోష్‌కుమార్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

Plants planted in green challenge should be protected
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News