Friday, April 26, 2024

29 నుంచి ప్రధాని విదేశీ పర్యటన

- Advertisement -
జి-20 సదస్సు, కాప్-26 సదస్సులో పాల్గొంటారు
న్యూఢిల్లీ: రోమ్‌లో జరుగనున్న 16వ జి-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 29న ఇటలీ వెళతారు. తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ కూడా పర్యటిస్తారు. కాప్-26 సదస్సులోనూ ప్రధాని పాల్గొంటారు. జి-20 సదస్సులో ప్రధాని పాల్గొనబోవడం ఇది ఎనిమిదోసారి. తొలిసారి ఆయన 2023లో ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని మోడీ ఇటలీ ప్రధానితో అనేక ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. గ్లాస్గో నగరంలో జరిగే ప్రపంచ నాయకుల సదస్సు (డబ్లుఎల్‌ఎస్) అయిన 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్-26)లో కూడా ఆయన పాల్గొంటారు. ఇది నవంబర్ 1-2 వరకు జరుగుతుంది. ఇందులో దాదాపు 120 దేశాధినేతలు పాల్గొనబోతున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News