Monday, April 29, 2024

నేపాల్‌కు రైలు

- Advertisement -
- Advertisement -

జెండా ఊపిన భారత్‌, నేపాల్‌ ప్రధానులు

న్యూఢిల్లీ: బిహార్‌లోని జైనగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకు మొదటి బ్రాడ్‌గేజ్‌ రైల్‌ లింకుకు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ప్రారంభించారు. పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను కూడా ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం మోదీతో దేవ్‌బా ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైల్వేస్‌, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు భారత్‌తో నాలుగు ఒప్పందాలపై దేవ్‌బా సంతకాలు చేశారు. భారత్‌-నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి యంత్రాంగం అవసరమని, సరిహద్దు గొడవలను ఇరు దేశాలూ బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు కాలపానీ సరిహద్దు వివాదాలపైనా వారు చర్చించారు.

అలాగే నేపాల్‌లో భారత రూపే చెల్లింపు కార్డును కూడా మోడీతో కలిసి దేవ్‌బా ప్రారంభించారు. భారత్‌-నేపాల్‌ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రతిజ్ఞ చేశామని, భారత్‌తో తమ బంధం అత్యంత కీలమని దేవ్‌బా తెలిపారు. ఈ మేరకు మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్‌-నేపాల్‌ మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని, అటువంటి సత్సంబంధాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవని మోడీ అన్నారు. నేపాల్‌కు భారత్‌ ముందు నుంచి సన్నిహితంగా ఉందని, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందన్నారు. ఆ దేశ అభివృద్ధి, శాంతి కోసం భారత్‌ సహకారం ఎప్పుడూ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇరు దేశాల సరిహద్దుల వద్ద అక్రమ కార్యకలాపాలు, నేరాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు.

నేపాల్‌తో చైనా వ్యూహాత్మక రైలు మార్గం

తన వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు నేపాల్‌-చైనా రైల్వే ప్రాజెక్టును చైనా శరవేగంగా పూర్తిచేస్తోంది. ఇప్పటికే తన సరిహద్దుల్లో రైలు కనెక్టివిటీని చాలా వరకు పూర్తిచేసింది. టిబెట్‌లోని కీరోంగ్‌, నేపాల్‌లోని ఖాఠ్మాండును ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. మొత్తం 121 కిలోమీటర్ల ఈ లైన్‌ను (ట్రాన్స్‌-హిమాలయన్‌) రాజకీయ కారణాల వల్లే చైనా నిర్మిస్తోందని ‘ద హాంగ్‌కాంగ్‌ పోస్టు’ (హాంగ్‌కాంగ్‌లో తపాలా సేవలందించే సంస్థ) పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News