Monday, April 29, 2024

18న మోడీ మాతృమూర్తి హీరాబెన్ 100వ పుట్టిన రోజు

- Advertisement -
- Advertisement -

PM Modi mother to enter 100th year on June 18

గుజరాత్ ప్రభుత్వం అరుదైన కానుక

గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ 100 వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆమె కీర్తి ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచేందుకు ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని గాంధీ నగర్ నగర పాలక సంస్థ నిర్ణయించింది. సేవా భావానికి సంబంధించిన పాఠాలను భావి తరాలు ఆమె జీవితం నుంచి నేర్చుకునేందకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గాంధీ నగర్ మేయర్ హితేశ్ మక్వానా బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ 100 వ పుట్టిన రోజు జూన్ 18 న జరుపుకుంటారని ఈ సందర్భంగా గుజరాత్ రాజధాని గాంధీనగర్ ప్రజల కోరికను, వారి భావాలను దృష్టిలో ఉంచుకుని రేషన్ పెట్రోలు బంకు నుంచి 80 మీటర్ల పొడవుగల మార్గానికి పూజ్య హీరాబెన్ మార్గ్ అని పేరు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News