Monday, May 6, 2024

సొంత వాహనం లేని ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

 4 బంగారు ఉంగరాలు… రూ 2.85 కోట్లు
 అప్పుల్లేవు . సొంత వాహనం లేదు
 జీతం మొత్తం జాగ్రత్తగా ఎఫ్‌డిలకు
 పొదుపు మంత్ర…గాంధీనగర్ ఇల్లు

PM Narendra Modi declared his Assets

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా సంపన్నులు అయ్యారు. తన చర ఆస్తులు ఆదాయం, అప్పుల లేమి వివరాల గురించి ప్రధాని సమర్పించిన ప్రకటనను ప్రధాని కార్యాలయం (పిఎంఒ) వెలుగులోకి తెచ్చింది. ఈ డిక్లరేషన్ ప్రకారం 2020 (ఈ ఏడాది) జూన్ 30వ తేదీ నాటికి మోడీ నికర ఆస్తుల విలువ కొంచెం పెరిగింది. ఆ రోజు సమర్పించిన డిక్లరేషన్ మేరకు ప్రధాని మోడీ మొత్తం మీద ఆదాయం ఇప్పుడు రూ 36 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆస్తుల విలువ రూ 2.49 కోట్లు ఉండగా ఇప్పుడు 2020లో ఇది రూ 2.85 కోట్లకు చేరుకుంది. ఆయన చర ఆస్తుల విలువలో పెంపుదలప్రధానంగా దాదాపుగా ఉన్న రూ 3.3 లక్షల బ్యాంకు డిపాజిట్లు, ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ 33 లక్షలు పెరగడం వల్ల ఏర్పడింది. ప్రధాని ఎటువంటి రుణాలు తీసుకోలేదు. ఆయన పేరిట ఎటువంటి వాహనం సొంతంగా లేదు.
ప్రధాని మోడీ చరాస్తుల వివరాలు
అందుబాటులో ఉన్న నగదు : ప్రధాని వద్ద ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి చేతిలో రూ 31,450 నగదు డబ్బులు ఉన్నాయి.
బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ల వివరాలు : ఈ ఏడాది జూన్ 30నాటికి ప్రధాని బ్యాంక్ బ్యాలెన్స్ రూ 3,38, 173. ఇవి గాంధీనగర్ ఎన్‌ఎస్‌సి బ్రాంచ్‌లో ఉన్నాయి. ఆయన బ్యాంక్ ఎఫ్‌డిఆర్, ఎంఒడి బ్యాలెన్స్ రూ 1,60,28,039 గా ఇదే బ్యాంక్‌లో నమోదు అయి ఉంది.
బాండ్ల రూపంలో పెట్టుబడుల వివరాలు ః ప్రధాని ఎల్ అండ్ టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ (టాక్స్ సేవింగ్) రూపంలో రూ 20,000 ల విలువైన బాండ్ ఉంది ( ఇది 2012 జనవరి 25 తేదీనాటిది)
ఎన్‌ఎస్‌ఎస్, ఎల్‌ఐసిలలో పెట్టుబడుల వివరాలు : ఈ ఏడాది జూన్ 30వ తేదీన ప్రధానికి ఉన్న జాతీయ పొదుపు సర్టిఫికెట్ల (పోస్టు) విలువ రూ 8,43,124. ఇక జీవిత బీమా పాలసీల విలువ రూ 1,50,957
నగలు, బంగారం ఇతర విలువైన వస్తువులు: ప్రధాని మోడీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటన్నింటి బరువు కలిపితే దాదాపుగా 45 గ్రాములు (2020 జూన్ 30వ తేదీ సంగతి) వీటి విలువ దాదాపుగా రూ 1,51,875 ప్రధాని మొత్తం చరాస్తుల విలువ మొత్తం మీద రూ 1,75,63,618. ఇంతకు ముందు ఇది రూ 1,39,10,260. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయనకు మరో ముగ్గురి పేరిట ఓ ఇల్లు, ఓ స్థలం ఉందని వెల్లడైంది. వీటి విలువ రూ 1.1 కోట్లు. ప్రధాని ఎక్కువగా పన్ను మినహాయింపు దారులు వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎక్కువగా బీమా పాలసీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లకు దిగుతున్నారు.
ప్రధానికి ప్రధాన ఆదాయ వనరు ప్రభుత్వం నుంచి నెలవారిగా పొందే రూ రెండు లక్షల జీతం. దీనిని ఆయన పొదుపు మంత్రం పాటిస్తూ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడుతున్నారు. దీనిపై వచ్చే వడ్డీని అతి జాగ్రత్తగా తిరిగి ఎఫ్‌డిగా పెట్టుబడిగా మార్చుకుంటూ ఉండటంతో ఆయన ఆదాయంలో వృద్ధి కన్పిస్తోందని విశ్లేషించారు. ప్రజా జీవితంలో పారదర్శకతలో భాగంగా కీలక పదవులలో ఉన్న వారు ఆస్తుల వెల్లడికి దిగాలని 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం కీలక ప్రక్రియను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లోని రాజకీయ నేతలు వారి ఆస్తులు, తమకు ఉన్న అప్పుల వివరాలను వెల్లడిస్తూ వస్తున్నారు.

PM Narendra Modi declared his Assets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News