Wednesday, May 1, 2024

బిజెపి, బిఆర్‌ఎస్‌ కలిసే వేధిస్తున్నాయి: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

పాల్పడుతున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని తెలుసని.. విమర్శించే వారిని వేధించడం కేసీఆర్‌కు అలవాటేనని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయిని.. బిఆర్‌ఎస్‌ నుంచి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.. తాను బీజేపీలోకి వెళ్లలేదని వార్నింగ్‌లు కూడా వచ్చాయని చెప్పారు. బిఆర్‌ఎస్‌ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే తనిఖీలు ఎందుకు చేయడంలేదని పొంగులేటి ప్రశ్నించారు.

హైదరాబాద్, ఖమ్మంలోని పొంగులేటి నివాసాలపై ఏకకాలంలో ఐటి అధికారులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్ లోని నందగిరిహిల్స్ నివాసంతోపాటు ఖమ్మంలోని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు పొంగులేటి నివాసంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతోపాటు సిబ్బంది ముబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు చేస్తున్నారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్న క్రమంలో ఐటీ దాడులు జరుగుతుండడంతో.. ఇది కేసీఆర్, మోడీ కలిసి చేయిస్తున్న పనేనని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News