Saturday, April 27, 2024

క్రికెట్‌కు ఓజా వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత వెటరన్ స్పిన్నర్, తెలుగుతేజం ప్రజ్ఞాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొన్నేళ్లుగా టీమిండియా టెస్టు జట్టులో చోటు సంపాదించడంలో విఫలమవుతున్న 33 ఏళ్ల స్టార్ బౌలర్ అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. టెస్టుల్లో ఓజా మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఓజా పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. సీనియర్ బౌలర్లు హర్భజన్, అనిల్ కుంబ్లే, అశ్విన్, జడేజా తదితరుల పోటీని తట్టుకుని ఓజా టీమిండియా తుది జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత జడేజా, అశ్విన్‌లే భారత్‌కు ప్రధాన స్పిన్ అస్త్రాలుగా మారడంతో ఓజా తన ప్రభను కోల్పోతూ వచ్చాడు. ఇక, తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2013లో ఆడాడు. ఇదే మ్యాచ్ భారత్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఆఖరి టెస్టు మ్యాచ్‌గా నిలిచింది. ఆ తర్వాత ఓజా టీమిండియాలో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. ఇక, నిరీక్షణకు తెరదించుతూ అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు.

Pragyan Ojha Announces Retirement from all formats 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News